iPhone Discount : ఐఫోన్‌పై రూ.10,000 డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండి-iphone huge discount iphone 13 now available with over 10000 rupees discount check price benefits and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone Discount : ఐఫోన్‌పై రూ.10,000 డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండి

iPhone Discount : ఐఫోన్‌పై రూ.10,000 డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండి

Anand Sai HT Telugu
Jul 25, 2024 08:30 AM IST

Discount On IPhone : ఐఫోన్ వాడాలి అని చాలా మంది ఉంటుంది. కానీ ధర చూసి భయపడిపోతారు. అలాంటివారి కోసం మంచి ఆఫర్ ఉంది. ఐఫోన్‌పై రూ.10000 డిస్కౌంట్ వస్తుంది.

ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్
ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ (Amazon)

ధనికుల కంటే ఐఫోన్ వాడాలనే కోరిక మధ్యతరగతి వారికే ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కోసం చూస్తుంటారు. మీకు కూడా ఐఫోన్లపై అమితమైన ప్రేమను కలిగి ఉంటే, ఐఫోన్ 13 ఇప్పుడు అమెజాన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దానిని సొంతం చేసుకోవడానికి ఇదే ఉత్తమ సమయం. ఐఫోన్ 13 ధర రూ.59,900 ఉండగా, తాజా డిస్కౌంట్‌తో ధర రూ.49,400కు తగ్గింది. ఈ 18 శాతం ధర తగ్గింపు ఆపిల్ పాపులర్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునేవారికి డబ్బును ఆదాను అందిస్తుంది. ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి చూద్దాం..

ఐఫోన్ 13 డిస్‌ప్లే

ఐఫోన్ 13లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డిఆర్ డిస్‌ప్లే ఉంది. ఇది మీకు ఫోన్‌లో కలర్స్, మంచి విజువల్స్ అనుభవాన్ని ఇస్తుంది. మీరు వీడియోలను స్ట్రీమింగ్ చేస్తున్నా, వెబ్ బ్రౌజ్ చేసినా ఈ అధిక నాణ్యత డిస్‌ప్లే వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఐఫోన్ 13 మెరుగైన సినిమాటిక్ ఫీచర్లు

ఈ డివైజ్‌లో సినిమాటిక్ మోడ్ ఉంది. ఇది వీడియో రికార్డింగ్‌కు ప్రొఫెషనల్ టచ్‌ను జోడిస్తుంది. మీరు తీసే వీడియోల రూపాన్నే మార్చేస్తుంది. సినిమాటిక్ మోడ్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన అనుభవాన్ని సృష్టిస్తుంది.

ఐఫోన్ 13 అడ్వాన్స్‌డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్

ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారు ఐఫోన్ 13 అధునాతన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను ఇష్టపడతారు. ఇందులో 12 ఎంపీ వైడ్, అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఈ సిస్టమ్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, స్మార్ట్ హెచ్‌డీఆర్ 4, నైట్ మోడ్ ద్వారా మద్దతు ఇస్తుంది. వినియోగదారులు వివిధ లైటింగ్ పరిస్థితులలో అధిక-నాణ్యత చిత్రాలను తీయడానికి అనుమతిస్తుంది. 4కె డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్ సామర్థ్యం వీడియోలు వివరంగా, రంగులో ఉండేలా చూసుకుంటుంది.

ఐఫోన్ 13 హై క్వాలిటీ ఫ్రంట్ కెమెరా

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 12 ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా నైట్ మోడ్, 4 కె డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్ కలిగి ఉంది. ఇది తక్కువ కాంతి పరిస్థితులలో కూడా స్పష్టమైన మంచి ఫొటోలను తీస్తుంది. మీ ఫోటోలు, వీడియోల నాణ్యతను పెంచుతుంది.

ఐఫోన్ 13 పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్

ఐఫోన్ 13లో మెరుపువేగం, సమర్థతకు పేరుగాంచిన ఏ15 బయోనిక్ చిప్ ఉంది. ఈ చిప్ మృదువైన మల్టీటాస్కింగ్, అధిక-పనితీరుకు మద్దతు ఇస్తుంది. ఇది మొత్తం మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. మొత్తంగా వినియోగదారులు అమెజాన్‌లో ఈ సూపర్‌ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇది గొప్ప అవకాశం.

Whats_app_banner