గత నెలలో విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ కొన్ని ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్‌లు, ఫీచర్లతో ప్రజల వచ్చింది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫీచర్లలో ఒకటి డ్యూయల్ క్యాప్చర్ వీడియో రికార్డింగ్!
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు.. ఫ్రెంట్, రేర్ కెమెరాల నుంచి ఏకకాలంలో వీడియోను చిత్రీకరించవచ్చు. వాస్తవానికి, ఐఓఎస్ 13 నుంచే పాత ఐఫోన్లలో ఈ ఫీచర్ ఉంది, కానీ దానిని థర్డ్-పార్టీ కెమెరా యాప్‌ల ద్వారా మాత్రమే ఉపయోగించగలిగేవారు. ఇప్పుడు ఐఫోన్ 17 మోడల్స్‌లో, వినియోగదారులు నేరుగా ఐఫోన్ కెమెరా యాప్ నుంచే ఈ ఫీచర్‌ను వాడుకునే అవకాశం ఉంది.
ఈ వీడియో రికార్డింగ్ ఫీచర్ గురించి మీకు తెలియకపోతే.. మీ కొత్త ఐఫోన్ 17 మోడల్స్‌లో డ్యూయల్ క్యాప్చర్ వీడియోను ఎలా ఆక్టివేట్ చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
మీ ఐఫోన్ 17 మోడల్‌లో డ్యూయల్ క్యాప్చర్ వీడియో ఫీచర్‌ను ఆన్ చేయడానికి, ఉపయోగించడానికి ఇక్కడ ఇచ్చిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి..
స్టెప్ 1: మీ ఐఫోన్ 17లో కెమెరా యాప్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు, Photos/Video (ఫోటోలు/వీడియో) ట్యాబ్‌లో, రికార్డింగ్ ప్రారంభించడానికి Video (వీడియో) ఆప్షన్‌ను ఎంచుకోండి.
స్టెప్ 3: స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న క్విక్ సెట్టింగ్స్ మెన్యూను ఓపెన్ చేయండి.
స్టెప్ 4: మీకు నాలుగు రికార్డింగ్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీరు డ్యూయల్ క్యాప్చర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 5: ఇప్పుడు వీడియో రికార్డింగ్‌ను ప్రారంభించడానికి ఎరుపు రంగులో ఉన్న రికార్డ్ బటన్‌ను నొక్కండి. మీరు రికార్డింగ్ ప్రారంభించడానికి కెమెరా క్యాప్చర్ బటన్‌ను కూడా ఉపయోగించవచ్చు.
గమనిక:
డ్యూయల్ క్యాప్చర్ ఆప్షన్ సెకనుకు 30 ఫ్రేముల (30 ఎఫ్‌పీఎస్) వద్ద మాత్రమే వీడియోలను రికార్డ్ చేస్తుంది! దీనిని 60 లేదా 120 ఎఫ్పీఎస్కు మార్చడం కుదరదు అని తెలుసుకోవాలి.
ప్రస్తుతానికి ఇది ఐఫోన్ 17 సిరీస్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఫీచర్. ఈ ఫీచర్ పాత తరం మోడల్స్‌కు కూడా అందుబాటులోకి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కాబట్టి మీ వద్ద కొత్త యాపిల్ ఐఫోన్ 17 మోడల్స్ ఏవైనా ఉంటే, ఈ ప్రత్యేకమైన ఫీచర్‌ను వెంటనే ప్రయత్నించండి.
సంబంధిత కథనం