iPhone 16 launch date : యాపిల్ లవర్స్ అలర్ట్- ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ డేట్ ఇదే!
ఐఫోన్ 16 సిరీస్తో పాటు, క్యూపర్టినో ఆధారిత టెక్ దిగ్గజం Apple Watch సిరీస్ 10, ఆపిల్ ఎయిర్పాడ్స్ 4 మరియు ఆపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ 2 లను ఈ ఈవెంట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 సిరీస్ కోసం ఎదురుచూస్తున్ని యాపిల్ లవర్స్‌కి అప్డేట్! ఈ ఏడాది మచ్ అవైటెడ్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌లో ఒకటైన ఐఫోన్ 16 సిరీస్‌పై ఒక వార్త బయటకి వచ్చింది. సెప్టెంబర్ 10న జరిగే ఈవెంట్లో కొత్త ఐఫోన్ సిరీస్‌ని యాపిల్ సంస్థ లాంచ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఐఫోన్ 16 సిరీస్తో పాటు ఈసారి యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ ఎయిర్పాడ్స్ 4, యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ 2 లను యాపిల్ సంస్థ ఈ ఈవెంట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఆ రోజు ఐఓఎస్ 18 కూడా బయటకు వస్తుందని సమాచారం.
16 సిరీస్ లాంచ్ కోసం యాపిల్ ఏర్పాట్లు..
సాధారణంగా ప్రతియేటా సెప్టెంబర్‌లో యాపిల్ తన ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌ని పెడుతుంది. ఈసారి ఇంకా లాంచ్ డేట్‌ని సంస్థ ధ్రువీకరించలేదు. కానీ సంస్థకు చెందిన సభ్యులు కొందరు, లాంచ్ డేట్ సెప్టెంబర్ 10 అని బ్లూమ్‌బర్గ్‌కి అనధికారికంగా చెప్పారు.
మరోవైపు కొత్త యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌కి వేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది.
కొత్త ఐఫోన్లు, ఎయిర్ పాడ్లు, వాచ్‌లు సెప్టెంబర్ ఈవెంట్లో అరంగేట్రం చేస్తాయని తెలుస్తోంది. అయితే మాక్‌లు ఒక నెల తరువాత అక్టోబర్‌లో ప్రత్యేక ఈవెంట్ ద్వారా రిలీజ్ అవుతాయని సమచారం.
సెప్టెంబర్ 20 నుంచి కొనుగోలుదారులు కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు కొనుగోలు చేసుకోవచ్చని సమాచారం.
ఐఫోన్ 16 సిరీస్ లాంచ్: సెప్టెంబర్ 10 ఎందుకు?
కొత్త ఐఫోన్ లాంచ్‌లకు మంగళ, బుధవారాలను యాపిల్ ప్రిఫర్ చేస్తుందన్న విషయాన్ని కాదనలేం. ఏదేమైనా, సెప్టెంబర్ మొదటి సోమవారం వచ్చే యూఎస్ హాలీడే లేబర్ డేని దృష్టిలో పెట్టుకుని కూడా యాపిల్ ఈవెంట్‌ని షెడ్యూల్ చేస్తుంది. మరి ఈసారి లాంచ్ డేట్ ఎప్పుడు ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.
కానీ మీడియా కథనాల ఆధారంగా ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 10 మంగళవారం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం