యాపిల్ ఐఫోన్ లవర్స్‌కి బిగ్ అప్డేట్! ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్ పరిమిత కాలం డిస్కౌంట్స్‌ని అందిస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
యాపిల్ తాజా స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అత్యంత విలువైన మోడల్స్‌గా నిలుస్తున్నాయి. ఈ పరికరాలు సాధారణంగా ప్రీమియం ధరను కలిగి ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటిని తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు హ్యాండ్‌సెట్‌లపై ఆఫర్‌లు ఉన్నాయి. దీనితో కొనుగోలుదారులు డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా, మీ పాత హ్యాండ్‌సెట్‌లను ఎక్స్ఛేంజ్ చేసి ఐఫోన్ 16 ప్రో లేదా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను మరింత తక్కువ ధరలకు పొందవచ్చని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది.
భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో బేస్ 128జీబీ వేరియంట్ ధర రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ హ్యాండ్‌సెట్‌పై ఎనిమిది శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా దీని ధరను రూ. 1,09,900కి తగ్గించింది. 256జీబీ వేరియంట్ రిటైల్ ధర రూ. 1,29,900 కాగా, దీనిని రూ. 1,22,900కు కొనుగోలు చేయవచ్చు. ఇది ఐదు శాతం ధర తగ్గింపును సూచిస్తుంది.
ఈ ఆఫర్ ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ బ్లాక్ టైటానియం, డెజర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ ఆప్షన్స్‌కి వర్తిస్తుంది.
ఇదిలా ఉండగా.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256జీబీ వేరియంట్ ప్రస్తుతం రూ. 1,32,900కి లిస్ట్ అయ్యింది. దీని రిటైల్ ధర రూ. 1,44,900 నుంచి 8శాతం మేర తగ్గింది. కొనుగోలుదారులు 512జీబీ, 1టీబీ మోడల్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. వీటి అసలు ధరలు రూ. 1,64,900- రూ. 1,84,900. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో వరుసగా రూ. 1,57,900, రూ. 1,77,900 ధరలకు లభిస్తున్నాయి.
ఐఫోన్లపై డైరెక్ట్ డిస్కౌంట్‌లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ఛేంజ్పై రూ. 48,150 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది! అయితే, అందించే మొత్తం పాత హ్యాండ్‌సెట్ మోడల్, కండిషన్‌తో పాటు మీరున్న ప్రదేశంలో ఆఫర్ లభ్యతపై అది ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే లావాదేవీలపై కొనుగోలుదారులు రూ. 4,000 వరకు 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 3,000 తగ్గింపు కూడా ఉంది. పూర్తి ఇన్వాయిస్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించకూడదనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది.
సంబంధిత కథనం