iPhone 16 price drop : ఇంతకన్నా తక్కువ ధరకు ఐఫోన్​ 16 దొరకదు- ఈ భారీ డిస్కౌంట్​ మీకోసమే..!-iphone 16 price drops to an all time low now available for just ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 16 Price Drop : ఇంతకన్నా తక్కువ ధరకు ఐఫోన్​ 16 దొరకదు- ఈ భారీ డిస్కౌంట్​ మీకోసమే..!

iPhone 16 price drop : ఇంతకన్నా తక్కువ ధరకు ఐఫోన్​ 16 దొరకదు- ఈ భారీ డిస్కౌంట్​ మీకోసమే..!

Sharath Chitturi HT Telugu

iPhone 16 price drop : ఐఫోన్ 16 ఇప్పుడు అతి తక్కువ ధరకు లభిస్తోంది! ఫ్లిప్​కార్ట్​ ఇస్తున్న ఈ డిస్కౌంట్స్​తో మీరు బెనిఫిట్​ పొందొచ్చు. మరి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్​ 16 ధర తగ్గింపు.. (HT Tech)

యాపిల్​ ఐఫోన్​ 16 ధర తగ్గితే కొనాలని చాలా మంది చూస్తుంటారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! 2024 సెప్టెంబర్​లో రూ. 79,900 ధరతో లాంచ్​ అయిన ఐఫోన్​ 16పై ప్రస్తుతం అతి భారీ తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 16 ఇప్పుడు ఫ్లిప్​కార్ట్​లో రూ .9,000 తగ్గింపుతో లభిస్తుంది. ఇంతకన్నా తక్కువ ధరకు ఆ యాపిల్​ ప్రాడెక్ట్​ దొరకకపోవచ్చు! మరి ఈ డీల్ ఎలా పనిచేస్తుంది? ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్​ 16 ప్రైజ్​ డ్రాప్​.. ఈ డీల్​ మిస్​ అవ్వొద్దు..

యాపిల్​ ఐఫోన్ 16పై ఫ్లిప్​కార్ట్​లో భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఇప్పుడు రూ .74,900కు ఈ స్మార్ట్​ఫోన్​ని కొనుగోలు చేసుకోవచ్చు. అంటే దాని వాస్తవ ధర రూ.79,900 నుంచి రూ.5,000 తగ్గింపు లభిస్తున్నట్టు.

ఇక్కడితే కథ పూర్తవ్వలేదు! రూ. 74,900 కన్నా తక్కువ ధరకు మీరు లేటెస్ట్​ ఐపోన్​ 16ని దక్కించుకోవచ్చు. ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇన్​స్టెంట్​గా రూ .4,000 తగ్గింపును అందిస్తున్నాయి. ఫలితంగా ఐఫోన్​ 16 ధర రూ .70,900 పడిపోతుంది. ప్రారంభ ధరతో పోలిస్తే మొత్తం రూ .9,000 తగ్గింపు లభిస్తున్నట్టు! ఐఫోన్ 16 లాంచ్ అయినప్పటి నుంచి ఇదే అతి తక్కువ ప్రైజ్​ డ్రాప్​ అని గుర్తుపెట్టుకోవాలి.

అంతేకాదు.. ఎక్స్​ఛేంజ్ బోనస్ కూడా ఉంది, ఇది ధరను మరింత తగ్గిస్తుంది!

మరి ఇప్పుడు ఐఫోన్ 16 కొనాలా?

ఐఫోన్ 16 కొనడానికి అనేక కారణాలు ఉన్నాయి! 60 హెర్ట్జ్ డిస్​ప్లే ఉన్న స్మార్ట్​ఫోన్​ బెస్ట్​ వాల్యూ ఫర్​ మనీ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా యాపిల్ ఏ18 చిప్​సెట్​ ఉండటంతో ఇది మరింత పవర్​ఫుల్​ అయ్యింది.

ఐఫోన్​ 16 ప్రైమరీ కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. 'ఫ్యూజన్' టెక్నాలజీ పుణ్యమా అని ఆప్టికల్ క్వాలిటీ 2ఎక్స్ టెలిఫోటో మోడ్ కూడా ఉంది. అలాగే, కొత్త కెమెరా కంట్రోల్ ఫీచర్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది! విజువల్ ఇంటెలిజెన్స్ వంటి ఏఐ-ఆధారిత ఫీచర్లను అన్​లాక్ చేస్తుంది. ఇది ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు ప్రత్యేకమైన యాపిల్ ఇంటెలిజెన్స్ సూట్​లో భాగం.

అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, క్లాసిక్ బ్లాక్​ వంటి అద్భుతమైన కలర్ ఆప్షన్లు ఐఫోన్ 16 పొందడానికి మరొక పెద్ద కారణం! అల్ట్రామెరైన్, టీల్ ఇప్పటివరకు ముఖ్యంగా ప్రాచుర్యం పొందాయి.

6.1 ఇంచ్​ కాంపాక్ట్ సైజులో ఉన్న ఈ ఐఫోన్​ 16 మార్కెట్​లో అతిచిన్న, అత్యంత శక్తివంతమైన ఫోన్లలో ఒకటిగా నిలిచింది. “బెస్ట్ స్మాల్ ఫోన్ ఆఫ్ ది ఇయర్”​గా పలు అవార్డులను కూడా గెలుచుకుంది.

రూ. 70,900 కే ఐఫోన్​ 16 వస్తుంటే కచ్చితంగా కొనాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత కథనం