Discounts on iPhone : ఐఫోన్ 16తో పాటు ఈ యాపిల్ ప్రాడక్ట్స్‌పై మతిపోయే డిస్కౌంట్స్.. త్వరపడండి!
Discounts on iPhone : విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16తో పాటు అనేక యాపిల్ ప్రాడక్ట్స్‌పై మతిపోయే డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ యాపిల్ డేస్ సేల్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త ఐఫోన్ మోడల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో పాటు మరెన్నో ఆప్షన్స్‌తో తన “యాపిల్ డేస్ సేల్”ని విజయ్ సేల్స్ ప్రారంభించింది. లేటెస్ట్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మోడళ్ల నుంచి ఐప్యాడ్స్, మాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌ల వరకు ప్రతిదీ భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. వినియోగదారులు వారి యాపిల్ ఎకోసిస్టమ్‌ని పూర్తి చేయడానికి లేదా మొదటి ప్రాడక్ట్‌తో వారి ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ సేల్ మంచి అవకాశం! యాపిల్ డేస్ సేల్ డిసెంబర్ 29, 2024న ప్రారంభమై.. జనవరి 5, 2025 వరకు కొనసాగుతుంది. ఈ హాలిడే సీజన్లో యాపిల్ ప్రాడక్ట్స్‌ని కొనడానికి ఇది సరైన సమయం!
ఐఫోన్స్‌తో పాటు యాపిల్ ప్రాడక్ట్స్‌పై డిస్కౌంట్ల వర్షం..
విజయ్ సేల్స్ యాపిల్ డేస్ సేల్‌లో కొనుగోలుదారులు ఐఫోన్ 16 (128 జీబీ వేరియంట్), ఐఫోన్ 16 ప్లస్ (128 జీబీ వేరియంట్)ని వరుసగా రూ.66900, రూ.75490 తగ్గింపు ధరలకు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ధరలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి రూ .4000 తగ్గింపు లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు ఐఫోన్ 16 ప్రో (128 జీబీ), ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256 జీబీ) కేవలం రూ.103900, రూ.127650 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ధరలో విజయ్ సేల్స్ ధర తగ్గింపుతో పాటు ఐసీఐసీఐ, ఎస్బీఐ- కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులను ఉపయోగించి రూ.3000 తక్షణ డిస్కౌంట్ పొందొవచ్చు.
అదనంగా, ఐఫోన్ 15 (128 జీబీ), ఐఫోన్ 15 ప్లస్ (128 జీబీ) కూడా ఆఫర్ ధర రూ.57490, రూ.66300 వద్ద లభిస్తాయి. ఈ డిస్కౌంట్లో బ్యాంక్ ఆఫర్లతో రూ.3000 తగ్గింపు కూడా ఉంది. వీటితో పాటు ఐఫోన్ 14, ఐఫోన్ 13 కూడా భారీ డిస్కౌంట్ ధరకు లభిస్తుండటంతో కొనుగోలుదారులకు ఐఫోన్ మోడళ్లపై భారీ డీల్ లభిస్తోంది.
లేటెస్ట్ ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రోతో పాటు ఇతర మోడల్స్‌పై డిస్కౌంట్స్ ఇలా..
ఎం2 చిప్‌తో పనిచేసే ఐప్యాడ్ ఎయిర్.. డిస్కౌంట్ ధర రూ.50499కు, తాజా ఎం4 చిప్‌తో కూడిన ఐప్యాడ్ ప్రో డిస్కౌంట్ ధర రూ.86899 వద్ద లభిస్తుంది. ఐప్యాడ్ 10వ జనరేషన్ విజయ్ సేల్స్‌లో కేవలం రూ.29,499కే లభిస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులను ఉపయోగించి రూ. 4000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ని పొందొచ్చు.
మాక్‌బుక్ మోడళ్ల కోసం, ఎం4 ఆధారిత మాక్‌బుక్ ప్రో బేస్ స్టోరేజ్ వేరియంట్ రూ .147900 తగ్గింపు ధరకు లభిస్తుంది. ఎం4 ప్రో ఆధారిత మాక్‌బుక్ ప్రో రూ.5000 బ్యాంక్ ఆఫర్ సహా రూ. 2,82,900 ప్రారంభ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం