iPhone 16 sale: ఐఫోన్ 16 కొనడం కోసం 21 గంటల పాటు క్యూలో వెయిట్ చేసిన ముంబై వాసి-iphone 16 goes on sale in india man waits 21 hours outside apple store ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 16 Sale: ఐఫోన్ 16 కొనడం కోసం 21 గంటల పాటు క్యూలో వెయిట్ చేసిన ముంబై వాసి

iPhone 16 sale: ఐఫోన్ 16 కొనడం కోసం 21 గంటల పాటు క్యూలో వెయిట్ చేసిన ముంబై వాసి

Sudarshan V HT Telugu
Sep 20, 2024 06:39 PM IST

భారత్ లో ఐఫోన్ మేనియా కొనసాగుతోంది. సెప్టెంబర్ 20,శుక్రవారం నుంచి భారత్ లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఐఫోన్ అభిమానులు ముంబైలోని బీకేసీలోని ఆపిల్ కంపెనీ స్టోర్ ముందు గంటల తరబడి క్యూలో నిల్చుని ఎదురు చూస్తున్నారు. ఒక వ్యక్తి గత 21 గంటలుగా క్యూలో ఉన్నానని చెప్పారు.

ఐఫోన్ 16 కొనడం కోసం 21 గంటల పాటు క్యూలో వెయిట్ చేసిన ముంబై వాసి
ఐఫోన్ 16 కొనడం కోసం 21 గంటల పాటు క్యూలో వెయిట్ చేసిన ముంబై వాసి (Bloomberg)

iPhone 16 sale: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ అధికారికంగా భారత మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్లను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు ముంబై నుంచి ఢిల్లీ వరకు ఆపిల్ స్టోర్ల ముందు గంటల తరబడి క్యూ కడుతున్నారు.

ముంబై బీకేసీ కాంప్లెక్స్ లో..

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (bkc)లోని ఆపిల్ ఫ్లాగ్ షిప్ స్టోర్ వెలుపల పెద్ద సంఖ్యలో ఐఫోన్ 16 కొనుగోలు దారులు క్యూలో ఉన్నారు. ఐఫోన్ 16 కొనేందుకు గంటల తరబడి క్యూ లల్లో ఎదురు చూస్తున్న అభిమానులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే, ముంబైలో మొదట తనే ఐఫోన్ 16 ను కొనాలన్న కోరికతో బీకేసీ లోని ఆపిల్ (apple) ఫ్లాగ్ షిప్ స్టోర్ ముందు క్యూలో వేచి ఉన్న షా తన అనుభవాన్ని ఇలా వివరించారు. ‘‘నేను గత 21 గంటలుగా నేను క్యూలో నిల్చున్నాను. నేను నిన్న ఉదయం 11 గంటల నుండి ఇక్కడ ఉన్నాను. ఈ రోజు ఉదయం 8 గంటలకు స్టోరులోకి ప్రవేశించే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఈ రోజు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. గతేడాది కూడా నేను 17 గంటల పాటు క్యూలో నిలబడ్డాను" అని షా చెప్పారు. షా మాదిరిగానే వందలాది మంది అక్కడ ఐఫోన్ 16 కొనడం కోసం ఎదురు చూస్తున్నారు. వారి అంకితభావం భారతదేశంలో ఆపిల్ కు ఉన్న విశ్వసనీయతకు తర్కాణంగా నిలుస్తుంది.

సూరత్ నుంచి వచ్చి వెయిటింగ్

ఉదయం 6 గంటలకు వచ్చిన మరో కస్టమర్ అక్షయ్ కూడా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనడం గురించి తన ఆలోచనలను పంచుకున్నాడు. "నాకు ఐఓఎస్ 18 నచ్చింది. జూమ్ కెమెరా నాణ్యత ఇప్పుడు మెరుగ్గా మారింది. నేను సూరత్ నుంచి వచ్చాను" అని అక్షయ్ తెలిపారు. తాజా ఐఫోన్ కోసం ప్రజలు ఎంత దూరమైనా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారని దీనివల్ల తెలుస్తోంది.

ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్

లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లతో నిండి ఉన్నాయి. వీటికి వరుసగా 6.3 అంగుళాలు, 6.9 అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. ఆల్వేస్-ఆన్ 120 హెర్ట్జ్ ప్రోమోషన్ డిస్ప్లే టెక్నాలజీ వీటిలో ఉంది. ప్రో మోడళ్లు డార్క్ బ్లాక్ టైటానియం, బ్రైట్ వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, కొత్త డిజర్ట్ టైటానియం రంగులలో ఇవి లభిస్తాయి.

కెమెరా సిస్టమ్

లేటెస్ట్ ఐఫోన్ (iphone) లలో కెమెరా వ్యవస్థ మరో ప్రధాన ఆకర్షణ. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, సెకండ్ జనరేషన్ క్వాడ్ పిక్సెల్ సెన్సార్, 120 ఎంఎం ఫోకల్ లెంగ్ తో 5ఎక్స్ టెలిఫోటో లెన్స్ తో ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కొత్త ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ రియల్-టైమ్ అడ్జస్ట్మెంట్ కు వీలు కల్పిస్తాయి. వినియోగదారులకు వారి షాట్లపై మరింత నియంత్రణను ఇస్తాయి. వీడియో వైపు, ఐఫోన్ 16 ప్రో 4 కె 120 క్యాప్చర్, డాల్బీ విజన్ మరియు మెరుగైన ప్రాదేశిక ఆడియోను అందిస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్లకు శక్తివంతమైన సాధనంగా మారుతుంది.