Apple event: ఐ ఫొన్ 15 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటించిన యాపిల్
Apple event: ఐ ఫోన్ లవర్స్ కి శుభవార్త. ఐ ఫోన్ 15 సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నవారికి ఆపిల్ శుభవార్త తెలిపింది. ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసే తేదీని ఆపిల్ సంస్థ ప్రకటించింది.
Apple event: ఐ ఫోన్ 15 సిరీస్ (iPhone 15 series) స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసే తేదీని ఆపిల్ సంస్థ ప్రకటించింది. ఆపిల్ సంస్థ ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ నిర్వహించి ఆ ఈవెంట్లో ఆ సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ ఆపిల్ సిరీస్ ఐ ఫోన్స్ ని లాంచ్ చేస్తుంటుంది. అలాగే ఈ సంవత్సరం అలాంటి ఈవెంట్ ని సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఆ ఈవెంట్లో ఆపిల్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేస్తుంది. ఆపిల్ ఫిఫ్టీన్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆపిల్ సంస్థ ఈ ఈవెంట్ లోనే ఆపిల్ వాచ్ 9 సిరీస్ ను అలాగే ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ను లాంచ్ చేయనుందని సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్
వివిధ టెక్ వెబ్సైట్లలో వచ్చిన సమాచారం మేరకు.. ఐఫోన్ 15 ప్రొ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండనున్నాయి. వీటిలో 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది దాదాపు ఐఫోన్ 14 ప్రో మోడల్స్ తరహా లోనే ఉంటుంది. ఈ సంవత్సరం ఆపిల్ తమ ఐ ఫోన్స్ కి స్టెయిన్లెస్ స్టీల్ బాడీని కాకుండా టైటానియం చాసిస్ ను ఉపయోగిస్తోంది. దీనివల్ల ఫోన్ బరువు చాలా వరకు తగ్గుతుంది. అలాగే మ్యూట్ బటన్ ను కొత్తగా మరో యాక్షన్ బటన్ తో రిప్లేస్ చేయనుంది. ఐ ఫోన్ 15 ప్రో మాక్స్ లో కొత్తగా ఏ 17 చిప్ ను, అలాగే, 5 జీ క్వాల్ కాం మోడెమ్ చిప్ ను అమర్చనున్నట్లు సమాచారం. అలాగే డైనమిక్ ఐలాండ్ డిజైన్తో ఐఫోన్ 15 ప్రో మాక్స్ వస్తుందని తెలుస్తోంది. ఇందులో యూఎస్ బీ - సీ చార్జింగ్ పోర్టు ఉంటుందని సమాచారం.
కెమెరా, కలర్స్, ధర..
ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ కెమెరా విషయానికి వస్తే జూమింగ్ క్యాపబిలిటీస్ ని మరింత పెంచారని, సరికొత్త పెరిస్కోప్ లెన్స్ ద్వారా 5x నుంచి 6x వరకు ఆప్టికల్ జూమ్ ను పెంచడానికి వీలవుతుందని నిపుణులు చెప్తున్నారు. సామ్సంగ్ హై ఎండ్ మోడల్స్ కు పోటీగా కెమెరా క్వాలిటీని పెంచినట్లు తెలుస్తోంది. ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ బ్లూ, సిల్వర్, గ్రే, బ్లాక్ కలర్స్ లో లభించనుంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ కన్నా 200 డాలర్ల వరకు అధికంగా ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ కు సంబంధించిన అంచనాలు మాత్రమే. పూర్తి వివరాలు సెప్టెంబర్ 12న జరగనున్న ఆపిల్ ఈవెంట్ లోనే నిర్దిష్టంగా తెలుస్తాయి.