iPhone 15 price cut : యాపిల్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ని ఇంకా కొనని వారికి అద్భుతమైన అవకాశం! ఐఫోన్ 15 ధరపై భారీ తగ్గింపును ప్రకటించింది దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్. ఆ తర్వాత, బ్యాంక్ ఆఫర్స్ అప్లై అవుతుండటంతో.. ధర మరింత దిగొచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
అమెజాన్‌లో ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ వాస్తవ ధర రూ. 79,900గా ఉండేది. ఇక ఈ ప్రైజ్‌పై 11 పర్సెంట్ డిస్కౌంట్ని ప్రకటించింది అమెజాన్. అంటే.. అమెజాన్‌లో ఐఫోన్ 15ని రూ. 70,999కే కొనుగోలు చేసుకోవచ్చు. అంటే మీకు రూ. 8,901 డిస్కౌంట్ లభిస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగిపోలేదు!
Amazon discounts on iPhone 15 : అమెజాన్ డిస్కౌంట్‌తో పాటు ఐఫోన్ 15పై ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి! అవి మరింత ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద.. ఐఫోన్ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును ఇస్తోందని అమెజాన్. ఏదైనా పాత ఫోన్ ఇస్తే, దాని పనితీరు బట్టి గరిష్ఠంగా రూ. 17,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ని ఇస్తోంది. అయితే.. ఇది ప్రతి చోట అందుబాటులో ఉండదు! మీ పిన్ కోడ్‌ని ఎంటర్ చేసి, ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఏది ఏమైనా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తే.. ఐఫోన్ 15 ధర ఇంకా తగ్గుతుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు పలు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి! హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై రూ. 150 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. వీటితో పాటు ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. చెక్ చేయండి.
iPhone 15 price drop in India : ఈ విధంగా.. ఐఫోన్ 15పై అమెజాన్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్ పొంది.. కొత్త గ్యాడ్జెట్‌ని కొనాలన్న మీ కలను నెరవేర్చుకోవచ్చు!
ప్రస్తుతం ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ని ప్రకటించిన అమెజాన్.. కొన్ని రోజుల క్రితమే.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపును ఇచ్చింది. ఐఫోన్ 15 ప్లస్ 128 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర రూ.89,900గా ఉంది. అయితే, ఆమెజాన్లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో పొందొచ్చు. ఐఫోన్ 15 ప్లస్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో వంటి 5 కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అమెజాన్‌లో ప్రస్తుతం ఐఫోన్ 15 ప్లస్‌పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డిస్కౌంట్‌తో ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 80990 లకు తగ్గుతుంది. అంటే, దాదాపు రూ.8910 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు ఐఫోన్ 15 ప్లస్‌పై ఉన్న ఇతర బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం