iPhone 14 Pro: ఐఫోన్ 14 ప్రో కొనాలనుకుంటున్న వారికి బ్యాడ్‍న్యూస్!-iphone 14 pro iphone 14 pro production slow down amid covid 19 restrictions ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Iphone 14 Pro Iphone 14 Pro Production Slow Down Amid Covid 19 Restrictions

iPhone 14 Pro: ఐఫోన్ 14 ప్రో కొనాలనుకుంటున్న వారికి బ్యాడ్‍న్యూస్!

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 11:06 AM IST

Apple iPhone 14 Pro: యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది కాస్త చేదువార్తే. ఈ మోడళ్ల ఉత్పత్తి మందగించినట్టు యాపిల్ పేర్కొంది. కారణం ఏంటంటే..

The Apple iPhone 14 Pro Max on sale: ఐఫోన్ ప్రియులను వేధిస్తున్న కొరత
The Apple iPhone 14 Pro Max on sale: ఐఫోన్ ప్రియులను వేధిస్తున్న కొరత (Bloomberg)

Apple iPhone 14 Pro: యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) రెండు నెలల క్రితం లాంచ్ అయింది. ఈ సిరీస్‍లో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ చాలా అప్‍గ్రేడ్‍లతో అదిరిపోయేలా ఉన్నాయి. దీంతో సాధారణ ఐఫోన్ 14 మోడళ్లతో పోలిస్తే ప్రో మోడల్స్ కు డిమాండ్ విపరీతంగా ఉంది. ఇప్పటికే ఆఫ్‍లైన్ మార్కెట్‍లో ఐఫోన్ 14 ప్రో లభించడమే కష్టమవుతోంది. ఆన్‍లైన్‍లోనూ అన్ని కలర్ ఆప్షన్లు, వేరియంట్లు దొరకడం లేదు. ఇలాంటి తరుణంలో మరో బ్యాడ్‍న్యూస్ చెప్పింది యాపిల్. ఐఫోన్ 14 మోడల్స్ ఉత్పత్తి ఆల్యమవుతోందని వెల్లడించింది. అందుకు కారణాలను పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Apple iPhone 14 Pro Production: చైనాలో కరోనా వైరస్ ప్రభావం మరోసారి ఉధృతమవటంతో యాపిల్ ఐఫోన్‍ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. చైనా జెంగ్‍జోయ్ (Zhengzhou) నగరంలోని ఫాక్స్ కాన్ ఐఫోన్‍ తయారీ ప్లాంట్‍లో కొవిడ్-19 ఆంక్షలు అమలులోకి వచ్చాయని యాపిల్ చెప్పింది. దీనివల్ల ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్ల తయారీపై తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కోసం కస్టమర్లు ఎక్కువ కాలం వేచిచూడాల్సి రావొచ్చు.

“జెంగ్‍జూయ్‍లోని ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అసెంబ్లింగ్ యూనిట్‍పై కొవిడ్-19 ఆంక్షల ప్రభావం పడింది. ప్రస్తుతం అక్కడి ఆపరేటింగ్ కెపాసిటీ గణనీయంగా తగ్గింది. మా సప్లయ్ చెయిన్‍లోని వర్కర్ల ఆరోగ్యానికి, రక్షణకు మేం ప్రాధాన్యతనిస్తాం” అని యాపిల్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ముందు అనుకున్న సంఖ్యలో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ షిప్‍మెంట్ చేయలేమనేలా యాపిల్ సంకేతాలు ఇచ్చింది.

దీంతో ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ కోసం కస్టమర్లు ఎక్కువ కాలం వేచిచూడాల్సి రావొచ్చని తెలిపింది. “ముందుగా ప్రణాళిక రచించుకున్న దానికంటే ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్ల షిప్‍మెంట్స్ తక్కువగా ఉంటుందని భావిస్తున్నాం. కొత్త ప్రొడక్టులను అందుకునేందుకు కస్టమర్లు కొంత ఎక్కువ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది” అని యాపిల్ పేర్కొంది. మళ్లీ సాధారణ స్థితి వచ్చేలా కృషి చేస్తామని చెప్పింది.

ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఇప్పటికే ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఆఫ్‍లైన్ మార్కెట్‍లో దొరకడం కష్టంగా మారింది. ఐఫోన్ 14 ప్రో అయితే అసలు స్టాక్‍లో ఉండడం లేదు. ఆన్‍లైన్‍ స్టోర్లలోనూ అన్ని వేరియంట్స్ అందుబాటులో లేవు. ఇప్పుడు షిప్‍మెంట్లు తగ్గుతాయని యాపిల్ అధికారంగా చెప్పటంతో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కొనాలనుకునే వారు ఎక్కువ కాలం నిరీక్షించాల్సి రావొచ్చు. ఈ-కామర్స్ సైట్స్ లోనూ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ స్టాక్ అయిపోయే అవకాశం కూడా ఉంది.

WhatsApp channel