iPhone 14 in new colour: కొత్త రంగుల్లో ఐఫోన్ 14
ఐఫోన్ 14 మరొక కొత్త రంగులో అలరించనుంది. ఈ నెల 14 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
గత ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఇప్పుడు కొత్త రంగుల్లో లభ్యం కానుంది. పసుపు రంగులో రానున్న ఐఫోన్ 14, 14 ప్లస్ మోడల్ స్మార్ట్ ఫోన్ మార్చి 14 నుండి అందుబాటులో ఉంటాయని, మార్చి 10 నుండి ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
‘వినియోగదారులు ఐఫోన్‌ను ఇష్టపడతారు. వారి పనుల కోసం ప్రతిరోజూ దానిపై ఆధారపడతారు. ఇప్పుడు కొత్త పసుపు రంగు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఉత్తేజపరుస్తుంది..’ అని ఐఫోన్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ బాబ్ ఆర్చర్స్ అన్నారు .
లైవ్ హిందూస్తాన్ అంచనా ప్రకారం ఈ మోడల్ ధర మారదు. ఐఫోన్ 14 ధర రూ . 79,900, అలాగే ఐఫోన్ 14 ప్లస్ ధర రూ .89,900గా ఉంది.
ఐఫోన్ 14, 14 ప్లస్ ఫీచర్స్
1. ప్రస్తుతం మిడ్ నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్, నీలం, ఊదా రంగుల్లో లభిస్తున్నాయి. పసుపు రంగులో 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ సామర్థ్యాలు అందుబాటులో ఉంటాయి.
2. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ ప్రమాదాల నుండి రక్షిస్తుంది.
3. ఫోటోగ్రఫీ కోసం అడ్వాన్స్‌డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో లభిస్తాయి. కొత్త ప్రో-లెవల్ మెయిన్ కెమెరాలో అందమైన ఫోటోలు, వీడియోలను అందించడానికి పెద్ద సెన్సార్ ఉంది.
4. చిప్‌సెట్ ఫోటోనిక్ ఇంజిన్, యాక్షన్ మోడ్, సినిమాటిక్ మోడ్ వంటి కెమెరా పనితనం అందిస్తుంది.
5. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి స్మార్ట్‌ఫోన్‌లను అప్‌సైకిల్ ప్లాస్టిక్ సీసాల నుండి రూపొందించారు.