Discount on iPhone 14: ఐఫోన్ 14పై రూ.7,000 వరకు డిస్కౌంట్.. ఆ ఒక్క చోటే!-iphone 14 gets a discount of up to rs 7000 at jiomart offline stores ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Iphone 14 Gets A Discount Of Up To Rs 7000 At Jiomart Offline Stores

Discount on iPhone 14: ఐఫోన్ 14పై రూ.7,000 వరకు డిస్కౌంట్.. ఆ ఒక్క చోటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 05, 2022 11:43 AM IST

Discount on iPhone 14: రూ.7,000 వరకు డిస్కౌంట్‍తో ఐఫోన్ 14 లభిస్తోంది. ధరపై తగ్గింపుతో పాటు బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

ఐఫోన్ 14పై రూ.7,000 వరకు డిస్కౌంట్.. ఆ ఒక్క చోటే!
ఐఫోన్ 14పై రూ.7,000 వరకు డిస్కౌంట్.. ఆ ఒక్క చోటే! (AFP)

Discount on iPhone 14: యాపిల్ రీసెంట్‍గా లాంచ్ చేసిన ఐఫోన్ 14 కొనాలనుకుంటున్నారా? అయితే తొలిసారి ఈ మొబైల్ మంచి డిస్కౌంట్‍తో లభిస్తోంది. రూ.7,000 వరకు తగ్గింపు ఈ iPhone 14ను సొంతం చేసుకోవచ్చు. అయితే జియోమార్ట్ ఆఫ్‍లైన్ స్టోర్స్​లో మాత్రమే ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ధరపై తగ్గింపుతో పాటు బ్యాంక్ కార్డ్ ఆఫర్ ద్వారా ఈ డిస్కౌంట్‍ను పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

iPhone 14 Discounts : ఆఫర్లు ఇవి

ఐఫోన్ 14 128జీబీ మోడల్ రూ.79,990 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం జియో మార్ట్ ఆఫ్‍లైన్ స్టోర్లలో ఈ మొబైల్ రూ.2,000 తగ్గింపుతో రూ.77,990 ధరకు లభిస్తుంది. అలాగే HDFC క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.5,000 తక్షణ క్యాష్‍బ్యాక్ దక్కుతుంది. అంటే ఆ ఆఫర్ ఉపయోగించుకుంటే రూ.72,900కే ఐఫోన్ 14 128జీబీ మోడల్‍ను సొంతం చేసుకోవచ్చు. జియోమార్ట్ ఆఫ్‍లైన్ స్టోర్లలో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

iPhone 14 Specifications : ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు

6.1 ఇంచుల సూపర్ రెటీనా XDR OLED డిస్‍ప్లేను ఐఫోన్ 14 కలిగి ఉంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, డాల్బీ విజన్ సపోర్ట్, సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటాయి. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‍తో ఈ మొబైల్ వస్తోంది. యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‍పై ఐఫోన్ 14 రన్ అవుతుంది.

ఐఫోన్ 14 వెనుక 12 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను యాపిల్ ఇచ్చింది. అధునాతన కెమెరా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. 5జీ, 4జీ ఎల్ఈటీ, వైఫై 6, బ్లూటూత్, ఎన్ఎఫ్‍సీతో పాటు మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. 20వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు iPhone 14 సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

స్పెసిఫికేషన్ల పరంగా ఐఫోన్ 14 కూడా ఐఫోన్ 13లాగానే అనిపిస్తుంది. అయితే పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ విభాగాల్లో ఐఫోన్ 14 మెరుగ్గా ఉంటుందని యాపిల్ చెబుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం