iPhone 13 price drop: అత్యంత తక్కువ ధరకే ఐ ఫోన్ 13-iphone 13 price plunges in this flipkart deal check discount ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 13 Price Drop: అత్యంత తక్కువ ధరకే ఐ ఫోన్ 13

iPhone 13 price drop: అత్యంత తక్కువ ధరకే ఐ ఫోన్ 13

HT Telugu Desk HT Telugu
Jun 24, 2023 06:04 PM IST

iPhone 13 price drop: ఫ్లిప్ కార్ట్ (Flipkart) సేల్ లో ఐ ఫోన్ 13 ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఐ ఫోన్ కొనాలని ఎదురు చూస్తున్నవారికి ఇది మంచి అవకాశం.

యాపిల్ ఐ ఫోన్ 13
యాపిల్ ఐ ఫోన్ 13 (REUTERS)

iPhone 13 price drop: ఫ్లిక్ కార్ట్ (Flipkart)లో బిగ్ బచత్ ధమాల్ సేల్ (Big Bachat Dhamaal sale) ప్రారంభమైంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ ఉత్పత్తులు సహా, చాలా ప్రొడక్ట్స్ అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నా.. ఈ సేల్ లో చాలా స్మార్ట్ ఫోన్స్ భారీ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి యాపిల్ ఐ ఫోన్ 13.

iPhone 13 : యాపిల్ ఐ ఫోన్ 13..

యాపిల్ ప్రొడక్ట్స్ ఇష్టపడేవారు మరో ప్రొడక్ట్ ను కొనుగోలు చేయడం పై ఆసక్తి చూపరు. యాపిల్ ఐ ఫోన్ 13 కొనాలనుకుని, అధిక ధర చూసి, ఆలోచనలో పడి ఆగిపోయిన వారికి ఇప్పుడు ఫ్లిక్ కార్ట్ లో బిగ్ బచత్ ధమాల్ సేల్ (Big Bachat Dhamaal sale) మంచి అవకాశం కల్పిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో చూపిన ప్రకారం ఐ ఫోన్ 13 (iPhone 13) ధర రూ. 69900. ఆ ధరపై ఫ్లిప్ కార్ట్ ఫ్లాట్ 16% డిస్కౌంట్ ఇస్తోంది. ఈ 16% డిస్కౌంట్ అనంతరం ఐ ఫోన్ 13 ధర రూ. 58499 కి చేరుతుంది.

iPhone 13 exchange bonus: ఎక్స్చేంజ్ బోనస్

ఈ డిస్కౌంట్ కాకుండా, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ. 1000ల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్ లభిస్తుంది. ఇవి కాకుండా, ఒకవేళ మీవద్ద వర్కింగ్ కండిషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, మీకు రూ. 35000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఆ డిస్కౌంట్ మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఐ ఫోన్ 13 లో ఓఎల్ఈడీ స్క్రీన్, ఏ 15 బయోనిక్ చిప్ సెట్, 12 ఎంపీ, 26 ఎంఎం వైడ్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

WhatsApp channel