iPhone 13 price cut: ఐ ఫోన్ 13 పై భారీ డిస్కౌంట్; 40 వేల లోపు ధరకే ప్రీమియం ఫోన్..-iphone 13 gets a massive 27 percent price cut on amazon heres how the deal works ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 13 Price Cut: ఐ ఫోన్ 13 పై భారీ డిస్కౌంట్; 40 వేల లోపు ధరకే ప్రీమియం ఫోన్..

iPhone 13 price cut: ఐ ఫోన్ 13 పై భారీ డిస్కౌంట్; 40 వేల లోపు ధరకే ప్రీమియం ఫోన్..

HT Telugu Desk HT Telugu
Nov 04, 2023 03:52 PM IST

iPhone 13 price cut: దీపావళి సందర్భంగా ఐఫోన్ 13 (iPhone 13) పై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కాకుండా, అదనంగా క్యాష్ బ్యాక్ డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Apple)

iPhone 13 price cut: ఈ పండుగ సీజన్ లో ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం. దీపావళి సందర్భంగా అమెజాన్ ఐఫోన్ 13 పై భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంకుల నుండి అదనపు డీల్‌లు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. వీటన్నింటితో iPhone 13 ఇప్పుడు మీకు రూ. 40,000 కంటే తక్కువకే లభిస్తుంది.

yearly horoscope entry point

27% price cut: 27% డిస్కౌంట్

స్టార్‌లైట్ కలర్‌లో ఉన్న Apple iPhone 13 (128GB) పై ఆమెజాన్ అత్యధికంగా, అంటే దాదాపు 27 శాతం తగ్గింపును అందిస్తోంది. 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఐ ఫోన్ 13వేరియంట్ అసలు ధర రూ. 69,900 కాగా, ఈ డిస్కౌంట్ అనంతరం ఈ ధర రూ. 50,749 కి తగ్గుతుంది. ఇతర బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డీల్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీల ద్వారా ఈ ఐ ఫోన్ ను కొనుగోలు చేస్తే, 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు గరిష్టంగా రూ. 1000 వరకు ఉంటుంది.

iPhone 13 price cut: ఎక్స్చేంజ్ ఆఫర్

ఆమెజాన్ లో ఐ ఫోన్ 13 పై ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. వర్కింగ్ కండిషన్ లో ఉన్న బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, గరిష్టంగా రూ. 45 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అంటే, ఒకవేళ, మీకు గరిష్ట ఎక్స్చేంజ్ ధర లభిస్తే, ఐ ఫోన్ 13 మీకు రూ. 10 వేలకే సొంతం అవుతుంది. అయితే, ఎక్స్చేంజ్ చేస్తున్న ఫోన్ బ్రాండ్, కండిషన్, మోడల్ ను బట్టి ఎక్స్చేంజ్ ధర ఉంటుంది.

iPhone 13 specifications: స్పెసిఫికేషన్స్

యాపిల్ ఐఫోన్ 13 అద్భుతమైన 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది రెండు అధిక-నాణ్యత కలిగిన కెమెరాలతో వస్తుంది, 12MP వైడ్, అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఇందులో ఉంది. ఇందులో ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, స్మార్ట్ HDR 4 వంటి విభిన్న ఫోటోగ్రఫీ మోడ్‌లను ఉపయోగించవచ్చు. ఇది తక్కువ-కాంతిలో గొప్ప ఫోటోల కోసం నైట్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. ఐఫోన్ 13 సూపర్-ఫాస్ట్ పనితీరు కోసం A15 బయోనిక్ చిప్‌పై నడుస్తుంది.

Whats_app_banner