iPhone 12 offers: ఐఫోన్ 12పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‍కార్ట్‌లో..-iphone 12 gets price cut on flipkart also you can use exchange offer ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Iphone 12 Gets Price Cut On Flipkart Also You Can Use Exchange Offer

iPhone 12 offers: ఐఫోన్ 12పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‍కార్ట్‌లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 22, 2022 11:17 PM IST

Apple iPhone 12 offers: యాపిల్ ఐఫోన్ 12 ప్రస్తుతం ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది. మరింత తక్కువకే ఈ మొబైల్‍ను సొంతం చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు.

iPhone 12 offers: ఐఫోన్ 12పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‍కార్ట్‌లో..
iPhone 12 offers: ఐఫోన్ 12పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‍కార్ట్‌లో.. (unsplash)

Apple iPhone 12 offers: మరీ ఎక్కువ మొత్తం ఖర్చు చేయకుండా యాపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఓ డీల్ ఆకర్షణీయంగా ఉంది. యాపిల్ ఐఫోన్ 12పై ప్రస్తుతం ఆఫర్స్ ఉన్నాయి. సుమారు రూ.35,000కే ఈ మొబైల్‍ను దక్కించుకునే ఛాన్స్ ఉంది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఐఫోన్ 12 అందుబాటులో ఉంది. దీంతో పాటు ఇతర ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ 12.. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన మోడల్ అయినా.. 5జీకి సపోర్ట్ చేస్తుంది. ప్రీమియమ్ మిడ్ రేంజ్ ధరలోనే ఐఫోన్ కావాలనుకునే వారికి ఇది సూటవుతుంది. మరి ఐఫోన్ 12పై ప్రస్తుతం ఉన్న డీల్ ఏదో చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

Apple iPhone 12 Offers: ఐఫోన్ 12పై ఆఫర్స్

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లో ప్రస్తుతం ఐఫోన్ 12 (64జీబీ) బేస్ వేరియంట్ ధర రూ.48,999గా ఉంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ.59,900 కాగా.. ప్రస్తుతం 18శాతం తగ్గింపు ధరతో లభిస్తోంది. ఒకవేళ మీ దగ్గర ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ఉంటే మరో రూ.1,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో రూ.15,000 వరకు తగ్గింపు దక్కించుకోవచ్చు. అయితే మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్చేంజ్ విలువ వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ 11 మోడల్‍ను ఎక్స్చేంజ్ చేస్తే ఐఫోన్ 12ను రూ.33,999కే సొంతం చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‍లను కూడా ఎక్స్చేంజ్ చేయవచ్చు. అయితే ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్చేంజ్ ద్వారా తగ్గింపు విలువ ఉంటుందని గుర్తుంచుకోవాలి.

iPhone 12 Specifications: ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు

6.1 ఇంచుల సూపర్ రెటీనా XDR OLED డిస్‍ప్లేను ఐఫోన్ 12 కలిగి ఉంది. హెచ్‍డీఆర్ 10, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. సెరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. నెక్ట్స్-జనరేషన్ న్యూరల్ ఇంజిన్‍తో కూడిన యాపిల్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఐఫోన్లు సుమారు ఆరు సంవత్సరాల వరకు ఓఎస్ అప్‍డేట్‍లను అందుకుంటాయి. ప్రస్తుతం ఐఓఎస్ 16కు ఐఫోన్ 12ను అప్‍గ్రేడ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 12 వెనుక.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‍ సపోర్ట్ ఉండే 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను ఐఫోన్ 12 కలిగి ఉంది.

ఐఫోన్ 12.. వైర్డ్, వైర్లెస్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 2,815 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 5జీ కనెక్టివిటీకి కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍ను Apple iPhone 12 కలిగి ఉంది.

WhatsApp channel