అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025 ఈవెంట్లో iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆవిష్కరించింది దిగ్గజ టెక్ సంస్థ. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న iOS 18 తర్వాత iOS 19 రావాల్సి ఉంది. కానీ డైరక్ట్‌గా iOS 26ని ప్రవేశపెట్టింది. దీనికి కారణాలేంటి? కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దీని ప్రత్యేకతలేంటి? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
తమ నేమింగ్ వ్యవస్థను మారుస్తున్నట్టు యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025 ఈవెంట్లో సంస్థ ప్రకటించింది. ప్రతి వెర్షన్ సీక్వెన్షియల్ నంబర్‌లకు బదులుగా ఇప్పుడు సంవత్సరం పేర్లను ఇవ్వడం జరుగుతుందని ప్రకటించింది.
అందుకే iOS 18 తర్వాత iOS 26 అందుబాటులోకి వచ్చింది. ఇది ఐఓఎస్‌కి మాత్రమే కాదు.. మొత్తం యాపిల్ ప్రాడక్ట్స్‌కి ఒకే విధంగా ఉంటుంది. అంటే.. iOS 26, watchOS 26, macOS 26, visionOS 26, iPadOS 26, tvOS 26.
మ్యాక్‌ఓఎస్, ఐప్యాడ్‌ఓఎస్, వాచ్‌ఓఎస్ వెర్షన్‌లకు సరిపోయేలా కొత్త వెర్షన్‌కు iOS 26 అని పేరు పెట్టడం ద్వారా యాపిల్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. విజువల్‌గా, iOS 26 "లిక్విడ్ గ్లాస్" డిజైన్‌ను పరిచయం చేసింది. ఇది లాక్ స్క్రీన్ నుంచి యాప్ ఐకాన్‌లు, విడ్జెట్‌ల వరకు ఇంటర్‌ఫేస్ అంతటా పారదర్శక, డైనమిక్ రూపాన్ని అందిస్తుంది. ఈ అప్‌డేట్ అడాప్టివ్ ఐకాన్ స్టైలింగ్, కొత్త యానిమేషన్‌లతో పర్సనలైజేషన్ని మెరుగుపరుస్తుంది.
iOS 26 అనేది యాపిల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ముఖ్యమైన అదనపు ఫీచర్లు:
మెరుగైన షార్ట్‌కట్‌లు, జెన్‌మోజీ, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి క్రియేటివ్ టూల్స్ ఏఐ ప్రక్రియలు ఆన్-డివైస్‌లోనే నిర్వహించడం జరుగుతుంది. తద్వారా యాపిల్ గోప్యతపై తన వైఖరిని మరింత బలపరుస్తుంది.
iOS 26తో యాపిల్ ఫోన్ యాప్ ఇప్పుడు ఇటీవలి కాల్స్, వాయిస్ మెయిల్‌లు, ఫేవరెట్‌లను కలిపి ఒకేచోట చూపించే సరళీకృత ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఇది కాల్ స్క్రీనింగ్ (కాల్‌ను స్వీకరించడానికి ముందు కాలర్ సమాచారం సేకరిస్తుంది), హోల్డ్ అసిస్ట్ (లైవ్ ఏజెంట్ సిద్ధంగా ఉన్నప్పుడు వినియోగదారులకు తెలియజేస్తుంది) వంటి ఫీచర్లను పరిచయం చేసింది.
మెసేజెస్ యాప్‌లో కొత్త ఫీచర్లలో తెలియని కాంటాక్ట్‌ల కోసం మెసేజ్ స్క్రీనింగ్, పోల్ క్రియేషన్ (అభిప్రాయ సేకరణ), కస్టమ్ చాట్ బ్యాక్‌గ్రౌండ్‌లు, గ్రూప్ చాట్‌లలో యాపిల్ క్యాష్ బదిలీలు ఉన్నాయి. గ్రూప్ థ్రెడ్‌ల కోసం టైపింగ్ ఇండికేటర్లు కూడా వచ్చాయి.
కార్‌ప్లే కాంపాక్ట్ కాల్ వ్యూస్, పిన్ చేసిన సంభాషణలు, ప్రయాణంలో రియల్ టైమ్ సమాచారం కోసం లైవ్ యాక్టివిటీస్‌తో మెరుగుపరచిన యూఐ (యూజర్ ఇంటర్‌ఫేస్) పొందింది. యాపిల్ మ్యూజిక్ లిరిక్స్ ట్రాన్స్‌లేషన్ (పాటల సాహిత్యం అనువాదం), లిరిక్స్ ప్రొనన్సియేషన్ (పాటల సాహిత్యం ఉచ్చారణ), ఆటోమిక్స్ డీజే ట్రాన్సిషన్స్‌ను iOS 26 ద్వార పరిచయం చేసింది.
వాలెట్ యాప్ ఇప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్లతో కూడిన ఇన్-స్టోర్ యాపిల్ పే మద్దతును అందిస్తుంది. విమానాల కోసం లైవ్ యాక్టివిటీస్‌ను అందిస్తుంది. మ్యాప్స్‌లో, ఐఫోన్‌లు ఇప్పుడు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించి సురక్షితంగా సందర్శించిన ప్రదేశాలను గుర్తించి, లాగ్ చేయగలవు.
అదనంగా, iOS 26 "యాపిల్ గేమ్స్" యాప్‌ను ప్రారంభించింది. ఇది యాపిల్ ఆర్కేడ్‌తో సహా అన్ని గేమింగ్ కార్యకలాపాలకు ఒక కేంద్రంగా ఉంటుంది. ఇది ఈవెంట్‌లు, స్నేహితుల కార్యకలాపాలు, గేమ్‌లకు ఫాస్ట్ యాక్సెస్‌ని అందిస్తుంది.
ఐఓఎస్ 26 ఇప్పుడు డెవలపర్ బీటాగా అందుబాటులో ఉంది. పబ్లిక్ బీటా జులైలో విడుదల అవుతుంది. ఫైనల్ లాంచ్ కొత్త ఐఫోన్ 17 లైనప్‌తో పాటు సెప్టెంబర్ 2025లో జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
ఐఫోన్ 11
ఐఫోన్ 12 సిరీస్
ఐఫోన్ 13 సిరీస్
ఐఫోన్ 14 సిరీస్
ఐఫోన్ 15 సిరీస్
ఐఫోన్ 16 సిరీస్
యాపిల్ ఇంటెలిజెన్స్‌లోని కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు మాత్రం ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 సిరీస్‌కే అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.
సంబంధిత కథనం