iOS 18.3: ఆపిల్ ఐఓఎస్ 18.3 విడుదల; ఆపిల్ ఏఐ సహా చాలా ఫీచర్స్ లో ఎన్నో అప్ గ్రేడ్స్
iOS 18.3: ఆపిల్ ఐఓఎస్ 18.3 తో లేటెస్ట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ సహా చాలా ఫీచర్స్ లో ఆసక్తికరమైన అప్ డేట్స్ వచ్చాయి. వాటిలోని టాప్ ఫీచర్లను ఇక్కడ చూడండి.
iOS 18.3: ఆపిల్ ఎట్టకేలకు ఐఓఎస్ 18.3 ను విడుదల చేసింది. ఇది అన్ని కంపేటబుల్ డివైజెస్ కు తదుపరి ప్రధాన ఐఓఎస్ అప్డేట్. ముఖ్యంగా ఐఫోన్ 16 సిరీస్ కు సంబంధించి పలు అప్డేట్ లను ఇది తీసుకొస్తోంది. ఇందులో విజువల్ ఇంటెలిజెన్స్ అప్ గ్రేడ్స్, బగ్ ఫిక్సింగ్, పలు సెక్యూరిటీ అప్ డేట్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో సహా ఐఓఎస్ 18.3 అప్డేట్ తో లభించే అప్ గ్రేడ్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

విజువల్ ఇంటెలిజెన్స్
మీరు ఐఫోన్ 16 మోడల్ ను ఉపయోగిస్తుంటే, కెమెరా కంట్రోల్ గురించి, దానిని ఎక్కువసేపు నొక్కడం ద్వారా మీరు విజువల్ ఇంటెలిజెన్స్ ను ఎలా యాక్టివేట్ చేయవచ్చో మీకు తెలుస్తుంది. ఆపిల్ ఐఓఎస్ 18.2 అప్ డేట్ తో దీనిని ప్రారంభించింది. ఇప్పుడు, ఐఓఎస్ 18.3 తో, ఆపిల్ మరింత సామర్థ్యాలతో ఈ ఫీచర్ ను విస్తరిస్తోంది. పోస్టర్ లేదా ఫ్లైయర్ నుండి మీ క్యాలెండర్ కు ఈవెంట్ ను జోడించగలగడం ఇందులో ఉంటుంది. కెమెరా కంట్రోల్ తో విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉపయోగించి మొక్కలు, జంతువులను కూడా మీరు గుర్తించవచ్చు. ఇది అన్ని ఐఫోన్ 16 మోడళ్లలో అందుబాటులో ఉంది.
నోటిఫికేషన్ సమ్మరీస్
ఈ మార్పు అన్ని ఐఫోన్ (IPhone) 15 ప్రో మోడళ్లకు, అన్ని ఐఫోన్ 16 మోడళ్లకు అందుబాటులో ఉంది. ఇప్పుడు, సెట్టింగ్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, లాక్ స్క్రీన్ నుండి నేరుగా నోటిఫికేషన్ సమ్మరీస్ కోసం సెట్టింగ్ లను మేనేజ్ చేయవచ్చు. సమ్మరైజ్డ్ నోటిఫికేషన్లను ఇటాలిజైజ్డ్ టెక్స్ట్ లో చూపించడం ద్వారా వాటిని ఇతర నోటిఫికేషన్ల నుండి వేరు చేస్తుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఏ నోటిఫికేషన్లను సంక్షిప్తీకరించారో, ఏవి సమ్మరైజ్ చేయలేదో సులభంగా చెప్పవచ్చు. కాగా, న్యూస్, ఎంటర్టైన్మెంట్ యాప్స్ (apps) నోటిఫికేషన్ సారాంశాలను యాపిల్ తాత్కాలికంగా తొలగించింది. వార్తా కథనాలను తప్పుగా సంక్షిప్తీకరించారని, తప్పుడు సమాచారానికి దారితీసే అవకాశం ఉందని నివేదికలు వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.
కాలిక్యులేటర్ అప్ డేట్స్
కాలిక్యులేటర్ అప్ డేట్ లో భాగంగా, టైప్ చేసిన సిరి అభ్యర్థనను ప్రారంభించేటప్పుడు కీబోర్డ్ కనుమరుగయ్యే సమస్యతో సహా ఆపిల్ అనేక బగ్ లను కూడా ఈ 18.3 లో పరిష్కరించింది. అదనంగా, ఆపిల్ మ్యూజిక్ మూసివేసిన తర్వాత కూడా, పాట ముగిసే వరకు ఆడియో ప్లేబ్యాక్ కొనసాగే సమస్యను కూడా ఆపిల్ పరిష్కరించింది. కొత్త ఫీచర్ల విషయానికొస్తే, ఆపిల్ కాలిక్యులేటర్ ఇప్పుడు మీరు ‘ఈక్వల్ టు’ గుర్తును మళ్లీ నొక్కినప్పుడు చివరి గణిత చర్యను పునరావృతం చేస్తుంది.
కొత్త వాల్ పేపర్లు
సాధారణంగా జనవరిలో ఆపిల్ (apple) కొత్త యూనిటీ వాల్ పేపర్లను విడుదల చేస్తుంది. ఈ అప్ డేట్ తో, ఆపిల్ సపోర్ట్ చేసే ఆపిల్ వాచ్ మోడళ్ల కోసం కొత్త వాచ్ ఫేస్ తో పాటు యూనిటీ రైథమ్ వాల్ పేపర్ లను జోడించింది.