Banking stocks: పైపైకి దూసుకుపోతున్న 4 బ్యాంకింగ్ స్టాక్స్ ఇవే..
స్టాక్ మార్కెట్ కీలక సూచీల్లో నెగటివ్ ట్రెండ్ కొనసాగుతున్నా.. కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం పాజిటివ్ గానే ముందుకు సాగుతున్నాయి.
Stock market: సాధారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ ను విశ్వసనీయ స్టాక్స్ గా ఇన్వెస్టర్లు పరిగణిస్తుంటారు. అందుకు అనుగుణంగానే, ఈ వారం ఈ నాలుగు బ్యాంకులు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. అంతేకాదు, అందులోని ఒక బ్యాంక్ 20% అప్పర్ సర్క్యూట్ ని కూడా అందుకుంది.
Banking stocks: బ్యాంకింగ్ స్టాక్స్
ఇటీవల బ్యాంకింగ్ స్టాక్స్ పైపైకి దూసుకుపోతున్నాయి. వాటిలో ప్రధానంగా ఈ నాలుగు స్టాక్స్ శుక్రవారం 52 వారాల గరిష్టానికి చేరుకుని రికార్డు సృష్టించాయి. ఇవే ఆ నాలుగు బ్యాంకులు..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(Indian Overseas Bank - IOB)
ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్. గత నాలుగు రోజులుగా ఈ స్టాక్ పైపైకి వెళ్తోంది. గత ఆరు సెషన్స్ లో 5 సెషన్స్ లో ఈ స్టాక్ 52 వారాల గరిష్టాన్ని చేరడం విశేషం. బ్యాంక్ నిఫ్టీ సూచీ కి విరుద్ధంగా ఐఓబీ స్టాక్ మాత్రం పాజిటివ్ గా దూసుకువెళ్తోంది. గరిష్టంగా రూ. 36.70కి చేరి 52 వారాల గరిష్ట రికార్డును తిరగరాసింది. స్టాక్ వాల్యూలో పాజిటివ్ ట్రెండ్ కారణంగా రికార్డు స్థాయిలో ఈ షేర్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి.
యూకో బ్యాంక్ (UCO Bank)
గత ఐదు ట్రేడింగ్ సెషన్లలోనూ 52 వారాల గరిష్టానికి చేరిన బ్యాంకింగ్ స్టాక్ ఇది. అలాగే, గత ఆరు రోజులుగా ప్రతీ రోజు 52 వారాల గరిష్టానికి చేరుతూ రికార్డు సృష్టిస్తోంది. ఈ వారంలో మంగళ, గురు వారాల్లో అప్పర్ సర్క్యూట్ ను సైతం టచ్ చేసింది. షేర్ల అమ్మకాల ఒత్తిడిలోనూ రికార్డు స్థాయిలో పెరుగుతూ, మదుపర్ల లాభాలను పెంచుతోంది.
ధన లక్ష్మి బ్యాంక్ (Dhanlaxmi Bank)
పేరుకు తగ్గట్లే ఈ బ్యాంక్ ఇన్వెస్టర్లకు ధనలక్ష్మిని ప్రసాదిస్తోంది. గత ఆరు రోజులుగా వరుసగా ఈ బ్యాంకింగ్ స్టాక్ 52 వారాల గరిష్టానికి చేరుతూ వచ్చింది. అలాగే, రెండు ట్రేడింగ్ సెషన్లలో ఇది అప్పర్ సర్క్యూట్ కు చేరింది. షేర్ వాల్యూ పెరగడంతో, లాభాల స్వీకరణ కోసం అమ్మకాల ఒత్తిడి పెరగడంతో, ఈ స్టాక్ లోయర్ సర్క్యూట్ ను కూడా టచ్ చేసింది.
ఇండ్ బ్యాంక్ హౌజింగ్ లిమిటెడ్(IND Bank Housing Ltd)
20% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిన ఫైనాన్షియన్ స్టాక్ ఇది. ఈ వారంలో వరుసగా రెండు రోజుల పాటు 52 వారాల గరిష్టంలో కొనసాగింది. అలాగే, గత రెండు సెషన్లలో 52 వారాల గరిష్టమైన రూ. 43.55 కి చేరి, 20% అప్పర్ సర్క్యూట్ ను టచ్ చేసింది.
శుక్రవారం మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి NSE Nifty 100 పాయింట్లను, BSE Sensex 200 పాయింట్లను కోల్పోయాయి.