'25లక్షల జీతం సరిపోవట్లేదు'- ​ఇన్​వెస్టర్​ ఆవేదన.. నాన్​సెన్స్​ అంటున్న నెటిజన్లు!-investor says 25 lakh salary package is too little for running a 3 member family ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  '25లక్షల జీతం సరిపోవట్లేదు'- ​ఇన్​వెస్టర్​ ఆవేదన.. నాన్​సెన్స్​ అంటున్న నెటిజన్లు!

'25లక్షల జీతం సరిపోవట్లేదు'- ​ఇన్​వెస్టర్​ ఆవేదన.. నాన్​సెన్స్​ అంటున్న నెటిజన్లు!

Sharath Chitturi HT Telugu
Aug 13, 2024 10:45 AM IST

25 Lakh Salary Package : ముగ్గురు సభ్యులుంటే కుటుంబాన్ని పోషించేందుకు తనకు రూ .25లక్షల ప్యాకేజ్​ సరిపోవడం లేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అది విన్న చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

'25 లక్షల జీతం సరిపోవట్లేదు'- ట్విట్టర్​లో ఇన్​వెస్టర్​ ఆవేదన..!
'25 లక్షల జీతం సరిపోవట్లేదు'- ట్విట్టర్​లో ఇన్​వెస్టర్​ ఆవేదన..!

దేశంలో చాలా మంది రూ. 20వేలు, రూ. 30వేలు సంపాదించడానికి కష్టపడుతుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తనకు ఏడాదికి రూ. 25లక్షల ప్యాకేజీ వస్తున్నా, అది సరిపోవట్లేదని వాపోతున్నాడు! ఎక్స్​​లో ఆ వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది..

సౌరవ్​ దత్త అనే ఇన్​వెస్టర్​ ట్విట్టర్​లో నిత్యం యాక్టివ్​గా ఉంటాడు. ఇటీవలే అతను ఓ ట్వీట్​ చేశాడు. అతనికి రూ. 25లక్షల ప్యాకేజ్​ సరిపోవడం లేదట. అన్ని ఖర్చులు పోనూ ఏం మిగలడం లేదని బాధపడుతున్నాడు.

"నా కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. కానీ రూ. 25లక్షల ప్యాకేజీ సరిపోవడం లేదు. 25 లక్షల ఎల్​పీఏ అంటే.. నెలకు రూ. 1.5లక్షలు. నిత్యవసరాలు, రెంట్​లకు నెలకు రూ. 1లక్ష ఖర్చు అవుతోంది. సినిమాలు, ఓటీటీలు ట్రిప్స్​కి రూ .25వేలు ఖర్చు అవుతోంది. ఎమర్జెన్సీ, మెడికల్​కి రూ. 25వేలు ఖర్చు అవుతోంది. ఇక ఏం మిగలడం లేదు," అని సౌరవ్​ దత్త ట్వీట్​ చేశాడు.

ఈ ట్వీట్​ ఇన్​స్టెంట్​గా వైరల్​ అయిపోయింది. చాలా రియాక్షన్స్​, కామెంట్స్​ వస్తున్నాయి. రూ. 25లక్షల ప్యాకేజ్​ సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతుంటే, పెరిగిపోతున్న ఖర్చులు చూస్తుంటే అది సరిపోదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ చాలా మంది మాత్రం, సౌరవ్​ దత్తను తప్పుబడుతున్నారు. అతను తప్పుడు లెక్కలు వేస్తున్నాడని అంటున్నారు.

"వైద్యం కోసం రూ. 25వేలు ఖర్చు చేస్తున్న కుటుంబం.. ఇతర ఖర్చుల కోసం రూ. 25వేలు ఖర్చు చేయదు. తప్పుడు లెక్కలు చూపించకు," అని ఒక నెటిజెన్​ కామెంట్​ చేశారు.

"కాస్త నేలను చూడు బ్రదర్​. లేదా ఎక్కడైనా టెస్ట్​ చేయించుకో! లేదా రెండూ ట్రై చెయ్​," అని ఓ వ్యక్తి సైటర్​ వేశాడు.

"ఏడాదికి రూ. 25లక్షల సంపాదిస్తున్న వ్యక్తికి రూమ్​ రెంట్​, నిత్యవసరాలు, ఎంటర్​టైన్మెంట్​ మీద ఎంత ఖర్చు చేయాలో తెలుస్తుంది. నాన్​సెన్స్​! ఎమర్జెన్సీ, వైద్యం అనేవి నెలవారీ ఖర్చులు కావు," అని మరొకరు పేర్కొన్నారు.

“ఇక్కడ చాలా మంది కనీసం రూ. 25 వేలు సంపాదించలేకపోతున్నారు. ఇతను మాత్రం రూ. 25లక్షల ప్యాకేజ్​ సరిపోవడం లేదని అంటున్నాడు,” అని మరో నెటిజన్​ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

సౌరవ్​ దత్త గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీలే క్రియేట్​ చేశాడు. ఈ జనరేషన్​లో ఏడాదికి రూ. 25లక్షల సంపాదన సరిపోదు అన్నాడు. ప్రస్తుత టెక్​ జీతాలపై చర్చలో భాగంగా ఈ మాటలు అన్నాడు. మార్కెట్​కి జీతాలకు సంబంధం లేకుండ పోతోందని అభిప్రాయపడ్డాడు. దశాబ్దాల ఎక్స్​పీరియెన్స్​ ఉన్న పరిశ్రమ ప్రొఫెషనల్స్​.. సౌరవ్​ దత్త స్టేట్​మెంట్​ను వ్యతిరేకించారు. రూ. 25లక్షల ప్యాకేజీ గౌరవప్రదమైనదే అని అభిప్రాయపడ్డారు.

మరి మీరేం అంటారు? ఏడాదికి రూ. 25లక్షల ప్యాకేజ్​ సరిపోతుందా? లేక పెరిగిపోతున్న ధరలకు రూ. 25లక్షలు సరిపోదా? ఎంత సంపాదిస్తుంటే ‘సరిపోతుంది’ అనుకోవచ్చు?

సంబంధిత కథనం