Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Small savings schemes: భారత్ లో మధ్య, దిగువ తరగతి ప్రజల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలు చాలా పాపులర్. చిన్నమొత్తాలకు సంబంధించిన వివిధ పథకాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడ్తుంటారు. కాగా, వాటి వడ్డీరేట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక ప్రకటన వెలువరించింది.
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Small savings schemes: పీపీఎఫ్, ఎన్ఎస్సీ సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. గత మూడు త్రైమాసికాలుగా ఈ వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చలేదు. తాజాగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని, 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి నోటిఫై చేసిన వడ్డీ రేట్లే యథాతథంగా కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.
మార్చి 31, 2025 వరకు..
అంటే, ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, చిన్న మొత్తాల పొదుపు పథకాలకు (small saving schemes) ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లే మార్చి 31, 2025 వరకు కొనసాగుతాయి.
- ప్రస్తుతం, సుకన్య సమృద్ధి (Sukanya Samriddhi yojana) పథకం కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటు ఉంది. మార్చి 31, 2025 వరకు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతుంది.
- అలాగే, మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై కూడా ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు (bank interest rates) అయిన 7.1 శాతం మరో మూడు నెలలు కొనసాగుతుంది.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు వరుసగా 7.1 శాతం, 4 శాతంగా ఉన్నాయి.
- కిసాన్ వికాస్ పత్రంపై (KVP) వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్రంపై పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూరిటీ అవుతాయి.
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పై వడ్డీ రేటు 2025 జనవరి-మార్చి కాలానికి 7.7 శాతంగా ఉంటుంది.
- ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్వెస్టర్లకు 7.4 శాతం రాబడిని ఇస్తుంది.
- గత నాలుగు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వం కొన్ని పథకాల్లో మార్పులు చేసింది.
- ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకులు నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (small saving schemes) వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి నోటిఫై చేస్తుంది.
టాపిక్
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.