Instagram Quite mode : మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోనే రోజంతా గడిపేస్తున్నారా? రీల్స్ చూస్తూ, ఫీడ్స్‌ని స్వైప్ చేస్తూ జీవితం సాగించేస్తున్నారా? ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తున్నారా? అయితే.. మీకోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. మీ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపించింది! అదే.. 'క్వైట్' మోడ్. ఈ క్వైట్ మోడ్ అనేది 'డు నాట్ డిస్టర్బ్'గా పనిచేస్తుందని చెబుతోంది. దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అంటోంది ఈ మెటా ఆధారిత సామాజిక మాధ్యమ దిగ్గజం.,ఏంటి ఈ క్వైట్ మోడ్..?ఈ క్వైట్ మోడ్‌ను గురువారం లాంచ్ చేసింది ఇన్స్టాగ్రామ్. ప్రస్తుతం ఇది అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనెడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్న యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తుంది. చదువుపై దృష్టిపెట్టకుండా.. గంటలు గంటలు రీల్స్, స్క్రోలింగ్ చేస్తున్న యువతకు ఈ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ ఉపయగపడనుంది.,Instagram new features : ముఖ్యంగా.. రాత్రి పూట యువత ఎక్కువ సేపు ఇన్‌స్టాగ్రామ్‌ను వాడితే.. ఈ యాప్ వారిని అలర్ట్ చేస్తుంది. క్వైట్ మోడ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే మీకొచ్చే నోటిఫికేషన్స్ ఆగిపోతాయి. మీ స్టేటస్.. ‘యాక్టివ్’ నుంచి 'ఇన్ క్వైట్ మోడ్'కు మారిపోతుంది. ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసిన తర్వాత.. ఆంతసేపు మిస్ అయిన అప్డేట్స్ అన్ని కనిపిస్తాయి.,WhatsApp new features : ప్రముఖ సోషల్ మీడియా వాట్సాప్ నుంచి త్వరలో రానున్న 5 కొత్త ఫీచర్స్ వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.,కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే.. ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ని కూడా ఇన్స్టాగ్రామ్ ప్రవేశపెడుతుండటం విశేషం. పెరెంటల్ కంట్రోల్‌ను మరింత పెంచేందుకు కూడా కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చింది. ఎక్స్ప్లోర్ ట్యాబ్‌లో కనిపించే వాటికి యూజర్లు ఇప్పుడు 'నాట్ ఇంట్రెస్టెడ్' అన్న ఆప్షన్‌ను టిక్ చేయవచ్చు. ఫలితంగా భవిష్యత్తులో ఆ రికమెండషన్లు కనిపించవు. పిల్లలు సెట్టింగ్స్ మారిస్తే.. అది పెద్దలు తెలుసుకోవచ్చు.,'నడ్జెస్' పేరుతో ఇటీవలే ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. ఏదైనా టాపిక్‌ను ఎక్కవసేపు చూస్తుంటే.. ఈ ఫీచర్ అలర్ట్ చేస్తుంది!,ఎక్కువగా వాడేస్తున్నారు..!Instagram Quite mode feature : ఉపయోగించేందుకు సులభంగా ఉండటం, ఆకర్షణీయమై ఇంటర్ఫేస్ ఉండటంతో.. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న సోషల్ మీడియా యాప్‌గా ఇన్స్టాగ్రామ్ ఎదిగింది. అయితే.. చాలా మంది ఈ యాప్‌ను వాడుతూ రోజంతా గడిపేస్తున్నారని, జీవితంలో ఏం చేయడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి మాటలు నిజమే అని కామన్ సెన్స్ మీడియా చేసిన సర్వే స్పష్టం చేస్తోంది! సోషల్ మీడియాలో యువత స్క్రీన్ టైమ్.. 2019 నుంచి 2021కి 17శాతం పెరిగింది. మరీ ముఖ్యంగా.. ఇతర యాప్స్‌తో పోల్చితే ఇన్‌స్టాగ్రామ్‌నే జెన్ జెడ్ ఎక్కువగా వాడుతోంది. ఈ తరుణంలో.. క్వైట్ మోడ్ వంటి ఫీచర్స్‌ను ఇన్స్టాగ్రామ్ ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.,