Instagram Reels : ఇన్​స్టాగ్రామ్​లో ఇక 3 నిమిషాలు రీల్స్​ చేసుకోవచ్చు- క్రియేటర్స్​కి నష్టమేనా?-instagram reels can now be 3 minutes long will it effect creators ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Instagram Reels : ఇన్​స్టాగ్రామ్​లో ఇక 3 నిమిషాలు రీల్స్​ చేసుకోవచ్చు- క్రియేటర్స్​కి నష్టమేనా?

Instagram Reels : ఇన్​స్టాగ్రామ్​లో ఇక 3 నిమిషాలు రీల్స్​ చేసుకోవచ్చు- క్రియేటర్స్​కి నష్టమేనా?

Sharath Chitturi HT Telugu
Jan 20, 2025 11:27 AM IST

Instagram Reels : ఇన్​స్టాగ్రామ్​లో ఇక నుంచి 3 నిమిషాల నిడివి గల రీల్స్​ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సంస్థ ప్రకటించింది. ఇది క్రియేటర్స్​ని, యూజర్స్​ని ఏమేరకు ప్రభావితం చేస్తుందో అని ఆందోళనలు మొదలయ్యాయి.

ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ నిడివి పెంపు..
ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ నిడివి పెంపు..

ఇన్​స్టాగ్రామ్​లో కంటెంట్​ క్రియేటర్స్​కి కీలక అప్డేట్​! ఇంతవరకు 90 సెకన్లుగా ఉన్న రీల్స్​ నిడివిని 3 నిమిషాలకు పెంచుతున్నట్టు సంస్థ ప్రకటించింది. అయితే, దీని వల్ల క్రియేటర్స్​కి ఇబ్బంది ఎదురవుతుందా? అని సందేహాలు మొదలయ్యాయి.

yearly horoscope entry point

ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ ఇప్పుడు 3 నిమిషాలు..

రీల్స్​ నిడివిని 3 నిమిషాలకు పెంచుతున్నట్టు ఇన్​స్టాగ్రామ్​ హెడ్​ ఆడమ్​ ముస్సెరి తెలిపారు. అంటే ఇప్పటివరకు ఉన్న 90 సెకన్లకు ఇది డబుల్​ టైమ్​. తమ సృజనాత్మకతను పెంపొందించుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ముస్సెరి వెల్లడించారు. అయితే, ఇన్​స్టాగ్రామ్​ మాత్రం షార్ట్​- ఫామ్​ వీడియోలు చేయడానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘటించారు. కానీ కంటెంట్​ క్రియేటర్ల ఫ్లెక్సిబులిటీని పెంచేందుకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని వివరించారు. ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ నిడివి చాలా 'రెస్టిక్టివ్​'గా ఉందని ఫీడ్​బ్యాక్​ వచ్చినట్టు, అందుకు తగ్గట్టుగానే ఈ మార్పులు చేసినట్టు స్పష్టం చేశారు.

క్రియేటర్లకు ఇది లాభామా? లేక నష్టమా?

యూజర్​ అటెన్షన్​ స్పాన్​ తగ్గిపోతూ వస్తున్న ఈ కాలంలో షార్ట్​ ఫామ్​ కంటెంట్​ని ఇచ్చే సంస్థలు వాటి నిడివిని పెంచుకంటూ వెళుతున్నాయి. యూట్యూబ్​ సైతం తన షార్ట్​ ఫామ్​ కంటెంట్​ షార్ట్స్​ నిడివిని 1 నిమిషం నుంచి 3 నిమిషాలకు మారుస్తూ 2024 అక్టోబర్​లో నిర్ణయం తీసుకుంది.

ఇలా రీల్స్​ నిడివిని పెంచడం ఇన్​స్టాగ్రామ్​కి కొత్తేమీ కాదు. దాదాపు రెండేళ్ల క్రితం నుంచే 1 నిమిషం 30 సెకన్ల వీడియోలను అప్​లోడ్​ చేసే అవకాశాన్ని ఇస్తోంది. అంతేకాదు, వాస్తవానికి లాంగ్​ ఫామ్​ వీడియోలను ప్రోత్సహించము అని చెబుతునే.. 10 నిమిషాల నిడివి గల రీల్స్​పైనా సంస్థ చాలాసార్లు టెస్టింగ్​ చేసింది. కానీ దానిని అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పుడు తాజాగా రీల్స్​ డ్యురేషన్​ని 3 నిమిషాలకు పెంచింది. మరి రానున్న రోజుల్లో ఈ రీల్స్​ నిడివి ఇంకెంత పెరుగుతుందో చూడాలి.

అయితే ఇది కంటెంట్​ క్రియేటర్స్​కి ఎంత మేరకు లాభం చేకురుస్తుందో చూడాలి. యూజర్​ బిహేవియర్​ ఏమేరకు మారుతుందో చూడాలి. పెద్ద రీల్స్​ని సగంలోనే వెదిలేసి వెళ్లిపోతే రీచ్​ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఇన్​స్టాగ్రామ్​ యూజర్స్​ ఈ లాంగ్​ రీల్స్​కి అలవాటు పడతారా? అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది.

వాస్తవానికి ఎక్కువ నిడివి గల రీల్స్​తో క్రియేటర్స్​కి ప్రమాదం అని గతంలో ఇన్​స్టాగ్రామ్​ చాలాసార్లు చెప్పింది.

Whats_app_banner

సంబంధిత కథనం