Instagram new feature: ఇన్ స్టాగ్రామ్ లో త్వరలో కొత్తగా ‘అన్ సీన్ స్టోరీ హైలైట్’ ఫీచర్; ఇది ఎలా పని చేస్తుందంటే..?
Instagram new feature: వినియోగదారులకు మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్స్ ను ఇన్ స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు తీసుకువస్తోంది. అందులో భాగంగానే త్వరలో అన్ సీన్ స్టోరీ హైలైట్ అనే మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
Instagram new feature: ఇన్ స్టాగ్రామ్ లో మీ కనెక్షన్ల స్టోరీ అప్ డేట్స్ చూడటం మిస్ అయ్యారా?.. వాటిని మళ్లీ వెతికి చూడడం ఇబ్బందిగా ఉందా? మీ కోసం ఇన్స్టాగ్రామ్ కొత్తగా అన్ సీన్ స్టోరీ హైలైట్ ఫీచర్ ను తీసుకువస్తోంది, ఇది వినియోగదారులు తమ 24 గంటల విండోలో తమ కాంటాక్ట్స్ పోస్ట్ చేసిన స్టోరీలను వారం రోజుల వరకు చూడటానికి వీలు కల్పిస్తుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫ్రెండ్స్, కనెక్షన్లు స్నేహితుల నుండి అప్ డేట్స్ ను పొందవచ్చు. ఇది వారి ఇన్స్టాగ్రామ్ (instagram) ఫాలోవర్లతో మెరుగైన కనెక్షన్లను రూపొందించడానికి అనుమతిస్తుంది. ఇన్స్టాగ్రామ్ కోసం ఈ కొత్త అన్ సీన్ స్టోరీ హైలైట్ ఫీచర్ ను మెటా ప్రతినిధి వెల్లడించారు. ఈ ఫీచర్ ను ప్రస్తుతం ఒక చిన్న గ్రూప్ పరీక్షిస్తోంది. ఈ కొత్త ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
ఇన్స్టాగ్రామ్ అన్ సీన్ స్టోరీ హైలైట్ ఫీచర్
ఈ అన్ సీన్ స్టోరీ హైలైట్ ఫీచర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు మ్యూచువల్ ఫ్రెండ్స్ (friends) అప్ లోడ్ చేసిన 24 గంటల తర్వాత కూడా స్టోరీలను చూడగలుగుతారు. వినియోగదారులు తమ పరస్పర కనెక్షన్ల నుండి చూడటం కోల్పోయిన అన్ని ఇన్ స్టా స్టోరీలను సులభంగా చూసేలా అన్ సీన్ స్టోరీ హైలైట్ ఫీచర్ ను కంపెనీ పరీక్షిస్తోందని మెటా ప్రతినిధిని ఉటంకిస్తూ టెక్ క్రంచ్ ప్రకటించింది. అన్ సీన్ స్టోరీ హైలైట్స్ స్టోరీస్ విభాగం చివరలో ఉంటాయి. అవి పోస్ట్ అయిన తరువాత సుమారు ఒక వారం వరకు అందుబాటులో ఉంటాయి. 24 గంటల తర్వాత కనుమరుగయ్యే రెగ్యులర్ స్టోరీస్ ను కాకుండా, గత వారం నుంచి కేవలం క్యూరేటెడ్ హైలైట్ ను మాత్రమే ఈ అన్ సీన్ స్టోరీస్ హైలైట్ ద్వారా చూపించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ ను అంతర్గతంగా పరీక్షిస్తున్నారు. ఇది వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. కాబట్టి, కొత్త ఇన్స్టాగ్రామ్ ఫీచర్ అధికారిక విడుదల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.