Inspire Films IPO: ఇన్ స్పైర్ ఐపీఓ కు భారీ స్పందన; 180 రెట్లు సబ్ స్క్రైబ్ అయిన రిటైల్ పోర్షన్
Inspire Films IPO: స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (SME) సెగ్మెంట్లో మార్కెట్లోకి వచ్చిన ఇన్స్పైర్ ఫిలిమ్స్ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. అక్టోబర్ 6వ తేదీన ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కానుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో రూ. 24 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి.
Inspire Films IPO: స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (SME) సెగ్మెంట్లో మార్కెట్లోకి వచ్చిన ఇన్స్పైర్ ఫిలిమ్స్ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజైన మూడో రోజు ఈ ఐపిఓ 127 రెట్ల సబ్స్క్రయిబ్ అయింది.
రూ. 56 నుంచి రూ. 59
ఈ ఇన్ స్పైర్ ఫిల్మ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. రూ. 56 నుంచి రూ. 59 మధ్య ఫిక్స్ చేశారు. ఈ ఐపీఓలో ఒక్కో లాట్ లో 2000 షేర్స్ ఉంటాయి. అంటే, ఒక లాట్ కు ఇన్వెస్టర్ రూ. 1,18,000 వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐపిఓ సెప్టెంబర్ 25న మార్కెట్లోకి వచ్చింది. ఐపీఓ కు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 27 తో ముగిసింది. ఈ ఐపీఓలో ఇప్పటివరకు 30.90 కోట్ల ఈక్విటీ షేర్లకి బిడ్డింగ్స్ వచ్చాయి. రిటైల్ కేటగిరిలో దాదాపు 180 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఎన్ఐఐ కేటగిరిలో 147 రెట్లు, క్యూఐబి కేటగిరిలో 25 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఎస్ఎంఈ (SME) కేటగిరీలో వచ్చిన ఈఐపిఓ కు ఇంత భారీ స్పందన రావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్య పరిచింది.
జీఎంపీ..
ఈ ఇన్స్పైర్ ఐపిఓ (Inspire Films IPO) షేర్లు బుధవారం గ్రే మార్కెట్లో 24 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే గరిష్ట ప్రైస్ బ్యాండ్ అయిన రూ. 59 లకు షేర్లు అలాట్ అయితే, జీఎంపీ రూ. 24 కలుపుకుని లిస్టింగ్ డే రోజు ఒక్కో షేరుకు రూ. 83 లభిస్తుంది. అంటే, ఇష్యూ ధరపై దాదాపు 40% లాభం వస్తుంది. టీవీ కంటెంట్, డిజిటల్ కంటెంట్ రూపకల్పన, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఈ ఇన్స్పైర్ ఫిల్మ్స్ సంస్థ ఉంది. ఈ ఐపీఓ షేర్ల అలాట్మెంట్ అక్టోబర్ 3వ తేదీన, స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అక్టోబర్ 6వ తేదీన జరగవచ్చు.