Infosys Q3 Results: క్యూ3 లో 11.4 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ లాభం.. అయినా..!
Infosys Q3 Results: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను గురువారం ఇన్ఫోసిస్ ప్రకటించింది. క్యూ3ఎఫ్వై25 లో ఇన్ఫోసిస్ ఆదాయం 11.4 శాతం వృద్ధి చెందింది. ఆదాయం 7.6 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరింది. జనవరి 16, 2025న ఈ షేరు 1.21 శాతం క్షీణించి రూ.1,926.20 వద్ద ముగిసింది.
Infosys Q3 Results: భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి (Q3FY25) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత సంవత్సరం క్యూ3 లో సంస్థ సాధించిన నికర లాభాల కన్నా 11.4 శాతం అధికం. గత క్యూ3 లో ఇన్ఫోసిస్ లాభం రూ. 6,106 కోట్లు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ లాభం రూ. 6,506 కోట్లు. క్యూ2తో పోలిస్తే, క్యూ3 లో లాభం 4.6 శాతం పెరిగింది.

క్యూ3 లో ఆదాయం రూ.41,764 కోట్లు
అదేసమయంలో క్యూ3 లో సంస్థ ఆదాయం 7.6 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరింది. ఈ క్యూ2 లో నమోదైన రూ.40,986 కోట్ల లాభంతో పోలిస్తే 1.9 శాతం మాత్రమే పెరిగింది. గత సంవత్సరం క్యూ3 లో ఇన్ఫోసిస్ ఆదాయం రూ 38,821 కోట్లు. మొత్తంగా, 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను 3.75-4.5 శాతం నుంచి 4.5 శాతానికి, మార్జిన్ గైడెన్స్ ను 20-22 శాతానికి పెంచింది. డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ (information technology) దిగ్గజం ఆపరేటింగ్ మార్జిన్ 0.8 శాతం పెరిగి 21.3 శాతానికి చేరుకుంది.
హెడ్ కౌంట్ గ్రోత్
మూడో త్రైమాసికం (q3 results) లో రికార్డు స్థాయిలో 1,263 మిలియన్ డాలర్ల నగదు ప్రవాహం నమోదైంది. లార్జ్ డీల్ విజయాలు 2.5 బిలియన్ డాలర్ల మొత్తం కాంట్రాక్ట్ విలువను (TCV) సాధించాయి. వీటిలో 63 శాతం నికర కొత్త ఒప్పందాలు. దీనికితోడు వరుసగా రెండో త్రైమాసికంలోనూ హెడ్ కౌంట్ పెరగడం స్థిరమైన విస్తరణను సూచిస్తోంది. జనవరి 16 గురువారం బీఎస్ఈలో ఇన్ఫోసిస్ (infosys) షేరు 1.21 శాతం నష్టంతో రూ.1,926.20 వద్ద ముగిసింది.
టాపిక్