Infosys salary hike : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలోనే శాలరీ హైక్ లెటర్స్..
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఉద్యోగుల శాలరీ హైక్ లెటర్స్‌ని త్వరలనే విడుదల చేసేందుకు ఇన్ఫోసిస్ ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం.
జీతాల పెంపు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్! శాలరీ హైక్‌కి సంబంధించిన లెటర్స్ త్వరలోనే ఉద్యోగుల చేతికి అందుతాయని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం 2025 ఫిబ్రవరిలో వార్షిక వేతన పెంపును ఇన్ఫోసిస్ ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు..
నగదు ఆదా కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో వేతన పెంపును స్తంభింపజేసిన ఇన్ఫోసిస్.. అక్టోబర్ 2023లో యాన్యువల్ అప్రైజల్ సైకిల్ని ప్రారంభించింది. చివరిగా.. 2023 నవంబర్ 1న ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఇది 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్‌కు సంబంధించిన అప్రైజల్ పీరియడ్. 2023 డిసెంబర్లో ఉద్యోగులకు రేటింగ్ లెటర్స్ అందాయి. సాధారణంగా జులైలో అమల్లోకి వచ్చే పెంపు కోసం జూన్‌లో లెటర్స్ అందుతాయి.
ఇక ప్రస్తుత విషయానికొస్తే, వార్షిక వేతన పెంపును 2025 ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ ప్రారంభించే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. దీని ప్రకారం జాబ్ లెవల్ 5 (జేఎల్ 5) లోని ఉద్యోగులు మొదట అప్రైజల్ లెటర్స్ అందుకునే అవకాశం ఉంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, జనవరి 1 నుంచి ఈ జీతాల పెంపు అమల్లోకి వస్తుంది. జాబ్ లెవల్ 5 (జెఎల్ 5) లోని ఉద్యోగులకు ఫిబ్రవరిలో వారి లేఖలు అందుతాయి. జేఎల్ 6, అంతకంటే ఎక్కువ లెవల్స్‌లో ఉన్నవారికి మార్చ్‌లో లెటర్స్ అందుతుంది.
జీతాల పెంపు వార్తలపై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
జేఎల్5లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు ఉంటారు.
జేఎల్6, అంతకంటే ఎక్కువ లెవల్స్‌లో మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, డెలివరీ మేనేజర్లు, సీనియర్ డెలివరీ మేనేజర్లు ఉంటారు. వైస్ ప్రెసిడెంట్స్‌ని ఇక్కడ మినహాయించారు.
ఇన్ఫోసిస్ బిజినెస్ అప్డేట్స్..
ఇక ఇన్పోసిస్ వ్యాపారం విషయానికొస్తే.. రూపాయి పతనం సంస్థకు చాలా మంచి చేయనుంది. రెవెన్యూ సాఫ్ట్‌గానే ఉన్నప్పటికీ రూపాయి పతనంతో మార్జిన్లు మెరుగుపడతాయని అంచనాలు ఉన్నాయి.
బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 86.39 వద్ద ఉంది. గత కొన్ని రోజులుగా రూపాయి బలహీనపడుతూనే ఉంది.
ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ 2024-25 రెండొవ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు 85% సగటు పనితీరు బోనస్ చెల్లింపును ఇచ్చింది. ఇది మొదటి త్రైమాసికం (80% సగటు చెల్లింపు) కంటే కొంచెం ఎక్కువ.
సంబంధిత కథనం