ఇన్ఫోసిస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్, కోఫోర్జ్ లిమిటెడ్ స్టాక్ హోల్డర్స్‌కి గుడ్ న్యూస్! 2025 ఏప్రిల్ నుంచి మే నెలల్లో ఆయా కంపెనీలు మధ్యంతర డివిడెండ్‌ని ప్రకటించనున్నాయి.
మార్చ్ 31, 2025తో ముగిసిన త్రైమాసికం / సంవత్సరానికి బ్యాంక్ ఆడిటెడ్ స్టాండలోన్, కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను పరిశీలించడానికి- ఆమోదించడానికి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ సిఫారసు చేయడానికి ఏప్రిల్ 19, 2025 శనివారం డైరెక్టర్ల బోర్డు సమావేశం జరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది.
2025 మార్చ్ 31తో ముగిసే సంవత్సరానికి కంపెనీ స్టాండలోన్, కన్సాలిడేటెడ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి, 2025 మార్చ్ 31తో ముగిసే సంవత్సరానికి కంపెనీ ఈక్విటీ షేర్లపై డివిడెండ్ ఏవైనా ఉంటే సిఫారసు చేయడానికి 2025 ఏప్రిల్ 25న బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు అల్ట్రాటెక్ సిమెంట్స్ నుంచి ప్రకటన వచ్చింది.
ఇన్ఫోసిస్ లిమిటెడ్ 17/04/2025 న జరగబోయే బోర్డు సమావేశం గురించి బీఎస్ఈకి తెలియజేసింది. 2025 మార్చ్ 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్ ఏమైనా ఉంటే బోర్డు సమావేశం పరిశీలించి సిఫారసు చేసే అవకాశం ఉంది.
కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం 08/05/2025 న జరుగుతుందని ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ బీఎస్ఈకి తెలియజేసింది. 2025 మార్చ్ 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్ సిఫారసులను కూడా ఈ సంస్థ పరిశీలిస్తుంది.
డివిడెండ్ విషయంపై 05/05/2025 న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరుగుతుందని కొఫోర్జ్ కూడా వెల్లడించింది.
ఒక కంపెనీ.. తనకు వచ్చిన లాభాల్లో వాటాదారులకు కొంత భాగాన్ని పంచుకోవడానికి ఈ డివిడెండ్లను ప్రకటిస్తుంది. రుణదాతలకు డబ్బులు చెల్లించిన తర్వాత వాటాదారులకు డివిడెండ్లు ఇవ్వడానికి కంపెనీలు తన మిగిలిన లాభాల్లో మొత్తం లేదా కొంత భాగాన్ని ఉపయోగిస్తాయి.
అయితే ఇలా లాభాలను కచ్చితంగా డివిడెండ్ల రూపంలో ఇవ్వాలని ఏం లేదు. ఒక కంపెనీకి నగదు కొరత ఉంటే లేదా రీ-ఇన్వెస్ట్మెంట్లకు నిధులు అవసరమైతే డివిడెండ్ చెల్లించకపోవచ్చు.
డివిడెండ్ ప్రకటించినప్పుడు సంస్థ ఒక రికార్డు తేదీని కూడా నిర్ణయిస్తుంది. ఆ తేదీలోగా డీమ్యాట్ అకౌంట్లో ఆ సంస్థ షేర్లు ఉన్న వారికే డివిడెండ్లు వస్తాయి.
డివిడెండ్ ఈల్డ్ అనేది ఇన్వెస్టర్లు ఒక కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చిన రాబడిని లెక్కించడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన పారామీటర్. చాలాసార్లు డివిడెండ్ అనేది ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్ చేయగల స్టాక్స్‌ను గుర్తించడానికి ఉపయోగించే కీలక పారామీటర్.
అయితే కేవలం డివిడెండ్లు మాత్రమే చూసి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ఫండమెంటల్స్ చూసి ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమని సూచిస్తున్నారు.
సంబంధిత కథనం