ఇన్ఫినిక్స్ తన నోట్ 50ఎస్ 5జీ+ స్మార్ట్ ఫోన్ లైనప్ ను 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో భారత్ లో విస్తరించింది. ఇప్పటికే ఈ మోడల్ లో 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ల వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో నోట్ 50ఎస్ 5జీ+ స్మార్ట్ ఫోన్ ని ఇన్ఫినిక్స్ భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది.
మరి ఈ కొత్త మోడల్ ఎంత ధరకు అందుబాటులో ఉంది, దాని లభ్యత ఏంటో ఓ లుక్కేద్దాం. ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ ప్లస్ కొత్త 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇది జూన్ 23 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా లభ్యం కానుంది. వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ ఎంపికలను అందించాలన్న లక్ష్యంతో ఈ వేరియంట్ ను తీసుకువచ్చామని ఇన్ఫినిక్స్ తెలిపింది.
ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ ప్లస్ స్మార్ట్ ఫోన్ రూబీ రెడ్, టైటానియం గ్రే రంగుల్లో మెటాలిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక ప్రత్యేకమైన మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ వేరియంట్ మైక్రో ఎన్కాప్సులేషన్ టెక్నాలజీతో వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉంది. దీని నుంచి వివిధ ఫ్లేవర్లలో సువాసన వస్తుండడం విశేషం.
ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ ప్లస్ స్మార్ట్ఫోన్లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్క్రీన్ 10-బిట్ కలర్ డెప్త్ ను సపోర్ట్ చేస్తుంది. 100 శాతం డిసిఐ-పి3 కలర్ గామట్ కవరేజీని అందిస్తుంది. అదనపు రక్షణ కోసం ఈ డిస్ ప్లేలో గొరిల్లా గ్లాస్ 5 కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్సెట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ ప్లస్ ఫోన్ పనిచేయనుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ ప్లస్ స్మార్ట్ఫోన్లో 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్682 ప్రధాన రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. డ్యూయల్ వీడియో క్యాప్చర్ కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ లో ఫోలాక్స్ ఏఐ అసిస్టెంట్, ఏఐ వాల్ పేపర్ జనరేటర్, ఏఐజీసీ మోడ్, ఏఐ ఎరేజర్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. 45వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉందని, ఇది గంటలో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ నీరు మరియు ధూళి నిరోధకత కోసం ఐపి 64 రేటింగ్ ను కలిగి ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ మన్నిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. క్విక్ అన్ లాక్, సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.
సంబంధిత కథనం