New Phone: బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో Infinix Note 12i లాంచ్-infinix note 12i launched in india check price specifications sale details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Phone: బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో Infinix Note 12i లాంచ్

New Phone: బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో Infinix Note 12i లాంచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2023 02:06 PM IST

Infinix Note 12i: ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్‍లో మరో మొబైల్ లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ వచ్చింది. ప్రత్యేక లాంచ్ ఆఫర్ ధరకు సేల్‍కు రానుంది.

New Phone: బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో Infinix Note 12i లాంచ్ (Photo: Infinix)
New Phone: బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో Infinix Note 12i లాంచ్ (Photo: Infinix)

Infinix Note 12i launched in India: ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ స్మార్ట్ ఫోన్ ఇండియాలో అడుగుపెట్టింది. తక్కువ ధరలో ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో ఈ ఫోన్‍ను ఇన్ఫినిక్స్ తీసుకొచ్చింది. 5000mAh బ్యాటరీతో పాటు ఫాస్ట్ చార్జింగ్‍కు కూడా ఈ 4జీ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేక లాంచ్ ధరతో ఫస్ట్ సేల్‍కు ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ రానుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ ధర, సేల్

Infinix Note 12i Price: 4జీబీ ర్యామ్ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ ధర రూ.9,999గా ఉంది. దీన్ని ప్రత్యేక లాంచ్ ధరగా ఇన్ఫినిక్స్ పేర్కొంటోంది. ఈ-కామర్స్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart )లో ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది. మెటావర్స్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో Infinix 12i లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ స్పెసిఫికేషన్లు

Infinix Note 12i Specifications, Features: 6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ వస్తోంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ 4జీ ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎక్స్ఓఎస్ 12తో అందుబాటులోకి వస్తోంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకోవచ్చు. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‍ను ఈ మొబైల్ కలిగి ఉంది.

50 మెగాపిక్సెల్ కెమెరాతో..

Infinix Note 12i Specifications: ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్, క్యూవీజీఏ ఏఐ వెనుక కెమెరాలతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.

ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా..

Infinix Note 12i Specifications, ఈ ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ బడ్జెట్ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్‍కు ఇచ్చింది ఇన్ఫినిక్స్. ఫింగర్ ప్రింట్ స్కానర్.. పవర్ బటన్‍కే ఉంటుంది.

సంబంధిత కథనం