Infinix Hot 30i: బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ నుంచి మరో ఫోన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే
Infinix Hot 30i: రూ.10వేలలోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఈ ఫోన్ వివరాలివే.
Infinix Hot 30i launched in India: ఇన్ఫినిక్స్ (Infinix) హాట్ సిరీస్‍లో మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్‍లోకి వచ్చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ (Infinix Hot 30i) సోమవారం లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో 4జీ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో సేల్‍కు అందుబాటులోకి వస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ పూర్తి వివరాలు ఇవే.
ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ధర, సేల్
Infinix Hot 30i Price, Sale: 8 జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉన్న ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ధర రూ.8,999గా ఉంది. ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లో ఈ మొబైల్ సేల్ మొదలవుతుంది. మిర్రర్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ స్పెసిఫికేషన్లు
Infinix Hot 30i Specifications, Features: మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ వస్తోంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎక్స్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍తో అడుగుపెట్టింది. 6.6 ఇంచుల హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేను ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ఫోన్ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‍ప్లే టాప్ సెంటర్ వద్ద వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంది.
Infinix Hot 30i: ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో ఏఐ లెన్స్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్‍కు ఇన్ఫినిక్స్ ఇచ్చింది.
Infinix Hot 30i Specifications: ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 10 వాట్ల స్టాండర్డ్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం ఈ మొబైల్‍కు యూఎస్‍బీ టైప్-సీ పోర్టు ఉంటుంది. మైక్రో ఎస్‍డీ కార్డు స్లాట్ ఉండగా.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‍కే ఉంటుంది. డ్యయల్ సిమ్ 4జీకి సపోర్ట్ చేస్తుంది. వైఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ మొబైల్ బరువు 181 గ్రాములు ఉంటుంది.