ఇన్ఫీనిక్స్ సంస్థ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో తాజాగా లాంచ్ చేసింది. దీని పేరు ఇన్ఫీనిక్స్ జీటీ 30 ప్రో. భారతదేశంలో రూ .25,000 లోపు ధర శ్రేణిలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఫ్లాట్ అమోఎల్ఈడీ డిస్ప్లే, వెనుక భాగంలో లైటింగ్, బైపాస్ ఛార్జింగ్ వంటి వివిధ గేమింగ్ ఫోకస్డ్ ఫీచర్లతో గత ఏడాది వచ్చిన జీటీ 20 ప్రోకి ఇది సక్సెసర్! పైగా ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 200 గ్రాముల లోపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ మొబైల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇన్ఫీనిక్స్ జీటీ 30 ప్రో 8 జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. 12 జీబీ ర్యామ్/ 25 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999.
అయితే కంపెనీ జీటీ 30 ప్రోతో ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఇది సేల్ రోజు ధరను వరుసగా రూ .22,999, రూ .24,999కు తీసుకువెళుతుంది.
ఇతర ఇన్ఫీనిక్స్ ఫోన్ల మాదిరిగానే, ఈ జీటీ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. జూన్ 12 నుంచి సేల్ మొదలవుతుంది.
ఇన్ఫీనిక్స్ జీటీ 30 ప్రోలో 6.78 ఇంచ్ 1.5కే ఎల్టీపీఎస్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ పై భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఉంటుంది. ఐపీ64 వాటర్- డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను ఈ గ్యాడ్జెట్ కలిగి ఉంది. అంటే ఇది కొద్దిగా స్ల్పాష్, తేలికపాటి వర్షపాతాన్ని తట్టుకోగలదు కాని నీటి కింద పూర్తి సబ్మెర్షన్కి పాడైపోవొచ్చు.
జీటీ 30 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇన్ఫీనిక్స్ ఈ ప్రాసెసర్‌ని 12 జీబీ వరకు ఎల్పిడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యుఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో కనెక్ట్ చేసింది.
జీటీ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6 లేయర్ 3డీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తున్నట్లు ఇన్ఫీనిక్స్ తెలిపింది. ఇది జీటి 20 ప్రోతో పోలిస్తే 20% వరకు హీట్ మేనేజ్మెంట్ని మెరుగుపరుస్తుంది. జిటి 30 ప్రోలో గేమర్స్ కోసం షోల్డర్ ట్రిగ్గర్స్ అని పిలిచే ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది. ఇది గేమ్‌ప్లే సమయంలో వినియోగదారులకు మరింత నియంత్రణను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే, ఇన్ఫీనిక్స్ జీటీ 30 ప్రో గేమింగ్ స్మార్ట్‌ఫోన్ 108 ఎంపీ ప్రైమరీ షూటర్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. రేర్ కెమెరా 60 ఎఫ్పీఎస్ వద్ద గరిష్టంగా 4కే, సెల్ఫీ షూటర్ 30 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియోలను రికార్డ్ చేయగలదు.
ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన నోట్ 50ఎస్, నోట్ 50ఎక్స్ తరహాలోనే జీటీ 30 ప్రోలో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. అయితే, ఈసారి ఇన్ఫీనిక్స్ 30 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ని కూడా అందిస్తోంది.
సంబంధిత కథనం