Indigo flight tickets : హోలీ సేల్​- ఇండిగోలో రూ. 1,199కే విమాన టికెట్లు! బంపర్​ ఆఫర్​ వివరాలివే..-indigo holi getaway sale is here get huge discounts and offers on flight tickets know details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indigo Flight Tickets : హోలీ సేల్​- ఇండిగోలో రూ. 1,199కే విమాన టికెట్లు! బంపర్​ ఆఫర్​ వివరాలివే..

Indigo flight tickets : హోలీ సేల్​- ఇండిగోలో రూ. 1,199కే విమాన టికెట్లు! బంపర్​ ఆఫర్​ వివరాలివే..

Sharath Chitturi HT Telugu

Indigo Holi Getaway Sale : మీరు విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్నారా? అయితే ఇండిగో హోలీ గెట్​అవే సేల్​ గురించి మీరు తెలుసుకోవాలి. సేల్​లో భాగంగా రూ. 1,199కే టికెట్​లను విక్రయిస్తోంది ఇండిగో. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇండిగో విమాన టికెట్​ సేల్​ షురూ.. (HT_PRINT)

ట్రావెలింగ్​ చేయాలనుకుంటున్న వారికి బంపర్​ ఆఫర్​! దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో.. విమాన టికెట్లపై అతి భారీ సేల్​ని నిర్వహిస్తోంది. "హోలీ గెట్​అవే సేల్​"లో భాగంగా ఇప్పుడు ఇండిగోలో డొమెస్టిక్​ ఫ్లైట్​ రేట్లు రూ. 1199 నుంచే ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా ఈ సేల్​ వర్తిస్తుంది. రూ. 4,199 వద్ద ఇంటర్ననేషనల్​ ఫ్లైట్​ టికెట్​ రేట్లు ప్రారంభమవుతున్నాయి. అంతేకాదు, goindigo.in లో టికెట్​లు బుక్​ చేసుకుంటే, అదనంగా 5శాతం వరకు తగ్గింపు లభిస్తుండటం మరో విశేషం!

ఇండిగో విమాన టికెట్​ ధరలపై భారీ ఆఫర్​..

ఇండిగో తీసుకొచ్చిన ఈ గెట్​అవే హోలీ సేల్.. 2025​ మార్చ్​ 10, అంటే సోమవారం మొదలై- 2025 మార్చ్​ 12, బుధవారం వరకు కొనసాగుతుంది. ఈ తేదీల్లో విమాన టికెట్​లను బుక్​ చేసుకునే వారికే ఈ సేల్​ వర్తిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. 2025 మార్చ్​ 17 నుంచి 2025 సెప్టెంబర్​ 21 వరకు చేసే ప్రయాణాల కోసం ఈ సేల్​ని ఉపయోగించుకుని తక్కువ ధరకే టికెట్లు బుక్​ చేసుకోవచ్చు!

ఇండిగో అధికారిక వెబ్​సైట్​ ప్రకారం.. ఈ ఆఫర్​ పీరియడ్​లో యాడ్​-ఆన్స్​ కింద డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ ట్రావెలింగ్​లో ప్రీ-పెయిడ్​ యాక్సెస్​ బ్యాగేజ్​ (15కేజులు, 20కేజీలు, 30కేజీల)లపై 20శాతం డిస్కౌంట్​ లభిస్తుంది. అదే సమయంలో స్టాండర్డ్​ సీట్​ సెలక్షన్​కి 30శాతం డిస్కౌంట్​ వర్తిస్తుంది. ఇక మీల్స్​ని ప్రీ-బుక్​ చేసుకుంటే 10శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. డొమెస్టిక్​ ఫ్లైట్స్​లో ఎమర్జెన్సీ ఎక్స్​ఎల్​ సీట్లు రూ. 599కి, అంతర్జాతీయ ఫ్లైట్​లో ఎమర్జెన్సీ ఎక్స్​ఎల్​ సీట్లు రూ. 699కే ప్రారంభమవుతాయి. వీటితో పాటు ఫాస్ట్​ ఫార్వర్డ్​ మీద 50శాతం, 6ఈ ప్రైమ్​, 6ఈ సీట్​ అండ్​ ఈట్​పై 30శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

అయితే ఎయిర్​పోర్ట్​ ఛార్జీలు, ప్రభుత్వ ట్యాక్స్​లపై డిస్కౌంట్లు వర్తించవని గుర్తుపెట్టుకోవాలి.

ఈ ఇండిగో హోలీ గెట్​అవే సేల్​ అనేది సంస్థకు చెందిన నాన్​-స్టాప్​ ఫ్లైట్లకే వర్తిస్తుంది. కనెక్టింగ్​-కోడ్​షేర్​ ఫ్లైట్స్​కి వర్తించదు. సేవర్​ ఫేర్​కి మాత్రమే ఈ ఆఫర్​ ఉంటుంది. ఫ్లెక్సీ ప్లస్​, సూపర్​ 6ఈ పేర్స్​కి వర్తించదు.

వన్​-వే బుకింగ్​కి మాత్రమే ఈ ఆఫర్​. రౌండ్​ ట్రిప్​, మల్టీ-సిటీ బుకింగ్స్​కి పనిచేయదు. గ్రూప్​ బుకింగ్స్​, హోల్డ్​ బుకింగ్స్​కి సైతం ఈ ఆఫర్​ వర్తించదు.

ఇతర స్కీమ్స్​, ప్రమోషన్స్​, ఆఫర్స్​తో ఈ ఆఫర్​ని క్లబ్​ చేయలేరు. మొత్తం మీద ఈ హోలీ గెట్​అవే ఆఫర్​ నాన్​-ట్రాన్స్​ఫరెబుల్​, నాన్​-ఎక్స్​ఛేంచెబుల్​.

ఇండిగో వెబ్​సైట్​, ఇండిగో మొబైల్​ యాప్​, ఇండిగో వాట్సాప్​ నెంబర్​ ((+917065145858) ద్వారా ఈ హోలీ సేల్​ని వినియోగించుకోవచ్చు.

బడ్జెట్​ ఫ్రెండ్లీ ట్రిప్స్​ ప్లాన్​ చేస్తున్న వారికి ఈ ఇండిగో హోలీ గెట్​అవే సేల్​ మంచి అవకాశం! తక్కువ ధరకే టికెట్​లు పొంది ట్రావెలింగ్​ని ఎంజాయ్​ చేయవచ్చు. అయితే, టికెట్​ బుక్​ చేసుకునే ముందు సేల్​లోని టర్మ్స్​ అండ్​ కండీషన్స్​ని చదవడం మర్చిపోకండి.

ఇండిగో హోలీ గెట్​అవే సేల్​కి సంబంధించిన మరిన్ని టర్మ్స్​ అండ్​ కండీషన్స్​ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం