టాటా ఈవీలను వెనక్కి నెట్టిన బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారు ఇది- ఇప్పుడు ధర భారీగా పెరిగింది!-indias best selling electric car mg windsor ev prices hiked check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  టాటా ఈవీలను వెనక్కి నెట్టిన బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారు ఇది- ఇప్పుడు ధర భారీగా పెరిగింది!

టాటా ఈవీలను వెనక్కి నెట్టిన బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారు ఇది- ఇప్పుడు ధర భారీగా పెరిగింది!

Sharath Chitturi HT Telugu
Jan 07, 2025 01:04 PM IST

MG Windsor EV price hike : ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారు ఎంజీ విండ్సర్​ ఈవీని కొనాలని చూస్తున్న వారికి షాక్​! ఈ మోడల్​ ధరలను సంస్థ భారీగా పెంచింది. పూర్తి వివరాలు..

ఎంజీ విండ్సర్​ ఈవీ
ఎంజీ విండ్సర్​ ఈవీ

ఇండియన్​ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్​కి గట్టి పోటీనివ్వడమే కాదు.. సేల్స్​ పరంగా సంస్థలోని ప్రముఖ ప్రాడక్ట్స్​ని వెనక్కి నెట్టిన ఎంజీ విండ్సర్​ ఈవీపై కీలక అప్డేట్​! ఈ ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించిన ఇంట్రొడక్టరీ ప్రైజ్​ ఆఫర్​ ముగిసింది. ఫలితంగా విండ్సర్​ ఈవీ ధరలను సంస్థ భారీగా పెంచింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

ఎంజీ విండ్సర్​ ధర పెంపు..

2024 అక్టోబర్​లో లాంచ్​ అయిన ఎంజీ విండ్సర్ ఈవీ​.. భారత రోడ్లపై దూసుకెళుతోంది. లాంచ్​ అయిన మూడు నెలల్లోనే 10వేలకుపైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. అంతేకాదు బెస్ట్​ సెల్లింగ్​ ఈవీగానూ ఈ మోడల్​ నిలిచింది. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్​ కారు ధర రూ .50,000 పెరిగింది. ఫలితంగా ఎంజీ విండ్సర్​ ఈవీ ఎక్స్​షోరూం ధర సుమారు రూ.14 లక్షల నుంచి ప్రారంభమై రూ.16 లక్షల వరకు ఉంది. అంతేకాదు, ఎంజీ ఈ-హబ్ అప్లికేషన్ ద్వారా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఉచిత ఛార్జింగ్ ఆఫర్ సైతం ఇకపై అందుబాటులో ఉండదు.

జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా విండ్సర్ ఈవీ అన్ని వేరియంట్ల ధరలను రూ .50,000 పెంచింది! ఎగ్జైట్ వేరియంట్ ధర రూ.13,99,800, ఎక్స్​క్లూజివ్ వేరియంట్ ధర రూ.14,99,800, టాప్ ఎండ్ ఎస్సెన్స్ వేరియంట్ ధర రూ.15,99,800. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

ఫ్రీ ఈ- హబ్​ కట్​..!

2024 డిసెంబర్ 31 వరకు విండ్సర్ ఈవీ డెలివరీ తీసుకున్న కస్టమర్లకు ఎంజీ ఈ-హబ్ అప్లికేషన్ ద్వారా ఉచిత ఛార్జింగ్ కూడా లభించింది. ఈ-హబ్ అప్లికేషన్ వివిధ కంపెనీల ఛార్జింగ్ స్టేషన్లను ఇంటిగ్రేట్ చేసి ఒకే అప్లికేషన్​లో చూపించింది. దీని ద్వారా, కస్టమర్ ఛార్జింగ్ స్టేషన్​ని ఎంచుకోవచ్చు. వారి కారును ఉచితంగా ఛార్జ్ చేయవచ్చు. అయితే పైన పేర్కొన్న విధంగా ఈ ఆఫర్ ఇకపై వర్తించదు.

ఎంజీ విండ్సర్ ఈవీ మొదటి రోజు 15,000కు పైగా బుకింగ్స్ అందుకుంది. ఇప్పటి వరకు అమ్మకాలు బలంగా ఉన్నాయి. మొత్తం మీద, విండ్సర్ ఈవీకి లభిస్తున్న డిమాండ్​ జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​కి చాలా పాజిటివ్​గా ఉంది.

ఎంజీ విండ్సర్ ఈవీ బ్యాటరీ, రేంజ్​..

జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని ఉపయోగిస్తోంది. ఇది 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్​ని అందిస్తుంది. వాస్తవ ప్రపంచంలో, డ్రైవింగ్ రేంజ్​ 260 నుంచి 280 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి బ్యాటరీ ప్యాక్​ని 55 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారులో పోర్టెబుల్ ఛార్జర్ స్టాండర్డ్​గా వస్తుంది. బ్రాండ్ వాల్ బాక్స్ ఛార్జర్​ను కూడా అందిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం