India's 100 richest: టాప్ 100 సంపన్న భారతీయుల జాబితా .. టాప్ 10 ఎవరో తెలుసా?-indias 100 richest got richer in 2022 forbes data wealth grew to top 10 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  India's 100 Richest Got Richer In 2022: Forbes Data; Wealth Grew To...top 10

India's 100 richest: టాప్ 100 సంపన్న భారతీయుల జాబితా .. టాప్ 10 ఎవరో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 08:15 PM IST

India's 100 richest: భారత్ లో అత్యధిక ఆస్తులున్న సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసింది. ఫోర్బ్స్ ప్రతీ ఏటా ఈ జాబితాను వెలువరిస్తుంది. 2022 ఫోర్బ్స్ జాబితాలోని విశేషాలు ఇవే..

ఆదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ ఆదానీ
ఆదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ ఆదానీ (HT_PRINT)

India's 100 richest: 2022లోనే ప్రపంచం ఆర్థికమాంద్యం దిశగా ప్రయాణించడం ప్రారంభమైందని, 2023లో మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయినా, ఈ మాంద్యం ప్రభావం భారత దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలపై అంతగా ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు. అయితే, భారత్ లోని టాప్ 100 సంపన్నుల మొత్తం సంపదలో.. 30% తొలి రెండు స్థానాల్లో ఉన్న గౌతమ్ ఆదానీ, ముకేశ్ అంబానీలదే కావడం గమనార్హం. ఫోర్బ్స్ జాబితాలోని ముఖ్యమైన విశేషాలివి..

ట్రెండింగ్ వార్తలు

  • భారత్ లోని తొలి 100 మంది సంపన్నుల మొత్తం సంపద ఈ సంవత్సర కాలంలో 25 బిలియన్ డాలర్లు పెరిగి, 800 బిలియన్ డాలర్ల బెంచ్ మార్క్ ను దాటేసింది.
  • భారత్ లో టాప్ 100 సంపన్నుల మొత్తం సంపద 385 బిలియన్ డాలర్లు.
  • టాప్ 1గా నిలిచిన ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ సంపద 2021లో మూడు రెట్లు పెరిగింది. 2022లో ఆయన సంపద విలువ 150 బిలియన్ డాలర్లు. ఆదానీ ప్రపంచంలోనే రెండో సంపన్నుడన్న(second richest in the world) విషయం తెలిసిందే. ఆదానీ ఆస్తుల విలు భారతీయ కరెన్సీలో రూ. 12, 11, 460.11 కోట్లు.
  • భారత్ లో రెండో సంపన్నుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ప్రస్తుతం ఆయన సంపద విలువ 88 బిలియన్ డాలర్లు. గత సంవత్సరం కన్నా అంబానీ ఆస్తుల విలువ 5% తగ్గింది.
  • డి మార్ట్ చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ యజమాని రాధాకిషన్ దామాని భారత్ లోని సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. దామానీ ఆస్తుల విలువ 27.6 బిలియన్ డాలర్లు. దామానీ తరువాత స్థానంలో కోవిడ్ టీకాతో పాపులర్ అయిన సీరమ్ ఇన్సిట్యూట్ కు చెందిన సైరస్ పూనావాలా ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 21.5 బిలియన్ డాలర్లు.
  • ఐదో స్థానంలో హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివ్ నాడార్ ఉన్నారు. ఆయన సంపద విలువ 17.28 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం దాదాపు 666 మిలియన్ డాలర్ల వరకు ఆయన వివిధ సంస్థలకు విరాళాలుగా ఇచ్చారు.
  • భారత్ లోని ఏకైక మహిళా బిలియనీర్ గా, భారత్ లోని సంపన్న మహిళగా(richest woman in India) ఇండియన్ విమెన్ గా జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. ఆమె సంపద విలువ 16.4 బిలియన్ డాలర్లు. సావిత్రి జిందాల్ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉంటారు.
  • ఏడో స్థానంలో 12.51 బిలియన్ డాలర్ల సంపదతో సన్ ఫార్మా ఫౌండర్ దిలీప్ సాంఘ్వి, 8వ స్థానంలో 12.27 బిలియన్ డాలర్ల సంపదతో హిందూజా బ్రదర్స్, 9వ స్థానంలో 12.11 బిలియన్ డాలర్ల సంపదతో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా నిలిచారు. 11.79 బిలియన్ డాలర్లతో బజాజ్ గ్రూప్ 10వ స్థానంలో నిలిచింది.
  • మహింద్ర అండ్ మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర ఈ జాబితాలో మళ్లీ స్థానం సంపాదించారు.
  • ఈ ఫోర్బ్స్ రిచెస్ట్ ఇండియన్స్ 2022 జాబితా ప్రకారం ఈ సంవత్సరం ఈ లిస్ట్ లోకి 9 కొత్త ముఖాలు వచ్చాయి.
  • వారిలో 44వ స్థానంలో నైకా గ్రూప్ ఫౌండర్ ఫాల్గుని నాయర్, ఎత్నిక్ గార్మెంట్స్ మేకర్(వేదాంత్ ఫ్యాషన్స్) రవి మోదీ, మెట్రో బ్రాండ్ షూ మేకర్ రఫీఖ్ మాలిక్ ఉన్నారు.

WhatsApp channel

టాపిక్