Tariff hike : షాకింగ్​.. రీఛార్జ్​ ప్లాన్స్​ ధరల పెంపుతో భారతీయులపై ఏడాదికి రూ. 47,500 కోట్ల భారం!-indians to spend extra 47 500 crore after price hike by jio airtel vodafone ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tariff Hike : షాకింగ్​.. రీఛార్జ్​ ప్లాన్స్​ ధరల పెంపుతో భారతీయులపై ఏడాదికి రూ. 47,500 కోట్ల భారం!

Tariff hike : షాకింగ్​.. రీఛార్జ్​ ప్లాన్స్​ ధరల పెంపుతో భారతీయులపై ఏడాదికి రూ. 47,500 కోట్ల భారం!

Sharath Chitturi HT Telugu
Updated Jun 29, 2024 01:45 PM IST

Airtel tariff hike : రిఛార్జ్​ ధరల పెంపు వల్ల భారతీయులపై ఎంత భారం పడుతుంది? అన్న విషయంపై ఒక రిపోర్ట్​ బయటకు వచ్చింది. ఆ వివరాలు..

రీఛార్జ్​ ప్లాన్స్​ ధరల పెంపుతో భారతీయులపై రూ. 47,500 కోట్ల భారం!
రీఛార్జ్​ ప్లాన్స్​ ధరల పెంపుతో భారతీయులపై రూ. 47,500 కోట్ల భారం!

Jio Tariff hike : రీఛార్జ్​ ధరలను పెంచి భారతీయ కస్టమర్లకు భారీ షాక్​ ఇచ్చాయి ప్రముఖ టెలికాం సంస్థలు. ఈ పరిణామాలతో భారతీయులపై రూ. 47,500 కోట్ల అధిక భారం పడనుందని ఓ నివేదిక వెల్లడించింది.

భారతీయులపై రూ. 47,500 కోట్ల భారం!

కొటాక్​ ఇన్​స్టిట్యూషనల్​ ఈక్విటీస్​ రీసెర్చ్​ నోట్​ ప్రకారం.. పెరిగిన టారీఫ్​లతో భారతీయులపై వార్షికంగా రూ. 47,500 కోట్ల అదనపు భారం పడుతుంది. కానీ.. ఇది టెలికాం సంస్థలకు మంచి విషయం! ఇంతకాలం ఇస్తున్న 5జీ సర్వీస్​ని మానిటైజ్​ చేసుకునేందుకు, 2016 నుంచి టెలికాం రంగంలో కనిపిస్తున్న తీవ్రమైన ప్రైజ్​ వార్​కి ఇది చెక్​ పెడుతుంది.

రిలయన్స్​ జియో తమ రీఛార్జ్​ ప్లాన్స్​ ధరలను 13శాతం నుంచి 27శాతం వరకు పెంచింది. భారతీ ఎయిర్​టెల్​.. 10శాతం నుంచి 21శాతం వరకు ప్రైజ్​ హైక్​ తీసుకుంది. వొడాఫోన్​ ఐడియా.. 10శాతం నుంచి 23శాతం వరకు తమ ప్లాన్స్​ని పెంచుకుంది. ఇదంతా రెండు రోజుల వ్యవధిలోనే జరిగిది!

5జీ ప్లాన్​ కావాలనుకునే జియో కస్టమర్​.. ఇప్పటివరకు రూ. 239 (రోజుకు 1.5జీబీ డేటా) చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు.. అది రూ. 349 (రోజుకు 2జీబీ డేటా)కి చేరింది.

ఈ విషయంలో జియో కన్నా ఎయిర్​టెల్​ మరింత ప్రైజ్​ హైక్​ తీసుకుంది! 5జీ కావాలంటే.. ఇప్పటివరకు రూ. 239 (రోజుకు 1.5జీబీ డేటా) చెల్లించాల్సి వస్తే.. ఇప్పుడది రూ. 409 (రోజుకు 2.5జీబీ)కి చేరింది.

ఇండియాలో టారీఫ్​ ప్రైజ్​ వార్​ని మొదలుపెట్టింది రిలయన్స్​ జీయోనే! ఎక్కువ సబ్​స్క్రైబర్స్​ కోసం ఆ సంస్థ తక్కువ ధరలకే సేవలను అందించింది. ఫలితంగా.. ఇతర టెలికాం సంస్థలు, కస్టమర్లను కోల్పోతాము అన్న భయంతో ఈ ప్రైజ్​ వార్​లోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు.. ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

ఎయిర్​టెల్​ కొత్త ప్లాన్స్​..

2జీబీ డేటా, అన్​లిమెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లతో 28 రోజుల వాలిడిటీ ఉండే ఎంట్రీ లెవల్ రూ. 179 ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్​.. రూ. 199 అయ్యింది. 6జీబీ డేటాతో 84 రోజుల పాటు వచ్చే రూ. 455 ప్లాన్​, ఇప్పుడు రూ. 509 అయ్యింది. ఇక 24జీబీ డేటాతో 365 రోజుల వాలిడిటీతో వచ్చే రూ. 1799 ప్లాన్​.. రూ. 1999 అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జియో కొత్త ప్లాన్స్​ ఇలా..

ఎంట్రీ-లెవల్ నెలవారీ ప్లాన్ గతంలో 28 రోజుల పాటు 2 GB డేటా కోసం రూ. 155 ధరలో ఉండేది. ఇప్పుడు ఆ ప్లాన్ ధర రూ. 189 చేరింది. 28 రోజుల వ్యవధిలో రోజుకు 1 GB ప్లాన్‌ని ఎంచుకునేందుకు రూ. 209 నుంచి రూ. రూ. 249 చెల్లించాల్సి ఉంది. రోజుకు 1.5 GB ప్లాన్ ధర రూ. 239 నుంచి రూ. 299కు పెరిగింది. రోజుకు 2 GB ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుంచి రూ. 349కి పెరిగింది. అధిక డేటా వినియోగం కోసం రోజుకు 2.5 GB ప్లాన్ రూ. 349 నుంచి రూ. 399కి పెంచింది. రోజుకు 3 GB ప్లాన్ ను రూ. 399 నుంచి రూ. 449కి పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం