Type-C Port for All Devices: అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‍లకు ఒకే చార్జింగ్ పోర్ట్: కీలక ముందడుగు-india to shift usb type c as common charging port for all electronic smart devices ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  India To Shift Usb Type C As Common Charging Port For All Electronic Smart Devices

Type-C Port for All Devices: అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‍లకు ఒకే చార్జింగ్ పోర్ట్: కీలక ముందడుగు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 17, 2022 11:19 AM IST

USB Type-C Port for All Devices: అన్ని స్మార్ట్ డివైజ్‍లకు యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ ఉండాలన్న అంశంలో కీలక ముందడుగు పడింది.

Type-C Port for All Devices: అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‍లకు ఒకే చార్జింగ్ పోర్ట్
Type-C Port for All Devices: అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‍లకు ఒకే చార్జింగ్ పోర్ట్ (Getty Images/iStockphoto)

USB Type-C Port for All Devices: మొబైళ్లు, ల్యాప్‍ట్యాప్‍లు, ట్యాబ్లెట్స్ తో పాటు అన్ని స్మార్ట్ ఎలక్ట్రానిక్ డివైజ్‍లకు ఒకే రకమైన చార్జింగ్ పోర్ట్ త్వరలో దశల వారీగా అమలులోకి రానుంది. ఈ అంశంలో కీలక ముందడుగు పడింది. అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‍లకు యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ లను ఇచ్చేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలతో పాటు ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఆర్గనైజేషన్స్ అంగీకరించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Consumer Affairs Ministry) సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ మినిస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల ప్రతినిధులతో పాటు MAIT, FICCI, CII, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్‍యూ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

“డివైజ్‍లన్నింటికీ కామన్ చార్జింగ్ పోర్ట్ ను దశల వారీగా అమలు చేసేందుకు అందరూ అంగీకరించారు. దీని ద్వారా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ మొత్తానికి ఇది వర్తిస్తుంది” అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

USB Type-C Port for All Devices: ఫీచర్ ఫోన్లకు మినహాయింపు!

స్మా ర్ట్ ఫోన్‍లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‍టాప్‍లు సహా ఎలక్ట్రానిక్ డివైజ్‍లన్నింటికీ చార్జింగ్ పోర్ట్ గా టైప్-సీ ఉండే అంశంపై ఈ సమావేశంలో అందరి మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని సమాచారం. అయితే ఫీచర్ ఫోన్లకు మాత్రమే వేరే పోర్ట్ ఉండొచ్చనేలా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

“వినియోగదారుల సంక్షేమం, ఈ-వేస్ట్ నిరోధం కోసం యూనిఫామ్ చార్జింగ్ పోర్ట్ ను అమలు చేసేందుకు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ వేగంగా చర్యలు చేపట్టాలి” అని మంత్రిత్వ శాఖ సెక్రటరీ సమావేశంలో చెప్పారు. స్మార్ట్ వాచ్‍ల లాంటి వేరబుల్స్ కు కూడా యునిఫామ్ చార్జింగ్ పోర్ట్ ఉండాలన్న అంశంపై కూడా సబ్ గ్రూప్‍ను కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేయనుంది.

ఈ-వేస్ట్ ను నిరోధించేందుకు అన్ని డివైజ్‍లకే ఒకేలాంటి చార్జింగ్ పోర్ట్ ను ఇవ్వాలని ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇలా ఉంటే చార్జర్స్, కేబుళ్ల వ్యర్థాలు తగ్గుతాయని భావిస్తోంది. ఇప్పటికే యూరప్ ప్రభుత్వం దీనిపై చట్టం చేసింది. 2024 నుంచి వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్‍లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‍టాప్‍లు సహా అన్ని డివైజ్‍లకు టైప్-సీ పోర్ట్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

WhatsApp channel

టాపిక్