ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ నిత్యవసరంగా మారింది. నెట్ లేనిది ఏ చాలా పనులు చేయకుండా అయిపోయింది. ఇది ఒక అవసరంగా మారింది. ఇంటర్నెట్ కొన్ని గంటలు డౌన్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటర్నెట్ కారణంగా జనసమూహాన్ని సమీకరించడం చాలా సులభం అయింది. సోషల్ మీడియాలో ఒకే ఒక పోస్ట్‌తో గంటలోపు పెద్ద ర్యాలీని నిర్వహించిన ఘటనలూ ఉన్నాయి. మరోవైపు ఇంటర్నెట్ దుర్వినియోగానికి సంబంధించిన అనేక కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. కొన్ని కారణాలతో అనేక దేశాలలో ఇంటర్నెట్ షట్‌డౌన్ జరిగింది.
2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ 296 సార్లు నిలిపివేశారు. 54 దేశాలలో ఇంటర్నెట్ షట్‌డౌన్ జరిగింది. ఇది ఒక కొత్త రికార్డు. యాక్సెస్ నౌ నివేదిక ప్రకారం.. 2023 సంవత్సరంలో 39 దేశాలలో దాదాపు 283 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు జరిగాయి. దీనితో పోలిస్తే 2024 సంవత్సరంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఇంటర్నెట్ నిలిపివేశారు.
గత 6 సంవత్సరాలుగా వరుసగా ప్రజాస్వామ్య దేశాలలో ఇంటర్నెట్ షట్‌డౌన్ జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. 2024 సంవత్సరంలో భారతదేశంలో 84 సార్లు ఇంటర్నెట్ నిలిపివేశారు. ప్రజాస్వా్మ్య దేశాల్లో ఇదే ఎక్కువ. అయితే మెుత్తం మీద చూసుకుంటే.. మయన్మార్ ముందంజలో ఉంది. అక్కడ నియంతృత్వ సైనిక ప్రభుత్వం ఉంది. ఈ దేశంలో 85 ఇంటర్నెట్ షట్‌డౌన్ జరిగింది. పాకిస్తాన్‌లో 21 షట్‌డౌన్‌లు, రష్యాలో ఇంటర్నెట్ 19 సార్లు నిలిపివేశారు. ఉక్రెయిన్‌లో 7 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు.
భారతదేశంలో 2023 సంవత్సరంలో 116 సార్లు ఇంటర్నెట్ నిలిపివేయగా.. 2024 సంవత్సరంలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల సంఖ్య 84కి తగ్గింది. అయినప్పటికీ ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో భారతదేశం ప్రజాస్వామ్య దేశాలలో అగ్రస్థానంలో ఉంది. మెుత్తంగా చూసుకుంటే రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో జరిగిన అన్ని ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో 41 నిరసనలకు సంబంధించినవి కాగా, 23 మత హింస కారణంగా జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కారణంగా కొన్ని ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు అయ్యాయి.
భారతదేశంలోని దాదాపు 16 రాష్ట్రాల్లో ఇంటర్నెట్ షట్‌డౌన్ సంఘటనలు జరిగాయి. మణిపూర్‌లో అత్యధికంగా ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు 21. హర్యానాలో 12 సార్లు, జమ్మూ కాశ్మీర్‌లో 12 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు. చాలా దేశాలలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌కు కారణం యుద్ధం. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలలో 103 షట్‌డౌన్‌లు జరిగాయి.
సంబంధిత కథనం
టాపిక్