World cup 2023 : వరల్డ్ కప్‌తో ఇండియా 'ఎకానమీ' హిట్.. వ్యాపారం మస్త్‌గా జరిగింది!
World cup 2023 : 2023 వరల్డ్ కప్‌తో ఇండియా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడింది! ఈ రెండు నెలల పాటు అనేక వ్యాపారాలు దూసుకెళ్లాయి. ఎన్నడూ లేనంత లాభాలు చూశాయి!
World cup 2023 final : 2023 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. అభిమానులను నిరాసపరిచింది. జట్టు ఓటమిపై చాలా మంది బాధపడ్డారు. ఇండియా కప్ కొట్టలేదేమో కానీ.. ఈ వరల్డ్ కప్ పుణ్యమా అని.. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడిందనే చెప్పుకోవాలి! ఈ రెండు నెలల కాలంలో.. క్రికెట్ చుట్టూ అల్లుకున్న వ్యాపారాలు జోరుగా సాగాయి.
ట్రెండింగ్ వార్తలు
సీట్స్ నుంచి టీవీ సేల్స్ వరకు..
ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్‌కి ముందు.. దేశవ్యాప్తంగా స్వీట్లు భారీగా అమ్ముడుపోయాయి. ఫలితంగా.. షుగర్ సేల్స్ పెరిగాయి. ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగించే పాల ఉత్పత్తులు, నట్స్, డ్రై ఫ్రూట్స్ సేల్స్ కూడా బాగా జరిగాయి. ఇండియా విక్టరీని సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా మంది వీటిని కొనుగోలు చేశారు.
వరల్డ్ కప్ పుణ్యమా అని.. మ్యాచ్‌లు జరిగిన ప్రతి స్టేడియానికి కొత్తగా పెయింట్స్ వేశారు. ఫర్నీచర్, సీట్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా.. వర్కర్స్, కాంట్రాక్టర్స్‌కి పని లభించింది. పెయింట్ బిజినెస్ బాగా జరిగింది.
India vs Australia World cup final : ఇక 2023 వరల్డ్ కప్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా.. రెస్టారెంట్లు కళకళలాడిపోయాయి. చాలా మంది.. ఇళ్లకు ఫుడ్‌ని డెలివరీలు చేసుకోగా.. ఇంకొంతమంది, తన స్మేహితులు- కుటుంబసభ్యులతో కలిసి డైనింగ్ చేశారు. వ్యాపారం బాగా సాగింది.
ఇక మ్యాచ్‌లు జరిగిన నగరాల్లో హోటల్స్ రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. విమానలు రేట్లు కూడా పెరిగాయి.
మరోవైపు ఫైనల్ మినహాయిస్తే.. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఫలితంగా.. టీమిండియా జెర్సీలు విపరీతంగా అమ్ముడుపోయాయి. టీవీ సేల్స్ పెరిగాయి. చాలా మంది చిన్న టీవీల నుంచి పెద్ద టీవీలకు అప్‌గ్రేడ్ అయ్యారు. రీటైలర్స్, కార్గో షిప్పింగ్, డెలివరీ ఏజెంట్స్, టెక్నీషియన్స్‌కి పని దొరికింది.
పైన చెప్పిన వాటన్నింటికీ.. బ్యాంక్‌లు లోన్లు ఇచ్చాయి. చాలా మంది ఈఎంఐల్లోనే టీవీలు కొన్నారు. ఫలితంగా.. బ్యాంక్‌లకు కూడా వ్యాపారం బాగా జరిగినట్టే!
2023 World cup India economy : టెలికామ్ ఆపరేట్స్కు వరల్డ్ కప్ వల్ల జోష్ వచ్చింది. చాలా మంది తమ ఫోన్స్‌లో మ్యాచ్‌లను చూడటం వల్ల డేటా ట్రాఫిక్ బీభత్సంగా పెరిగింది. అదే సమయంలో రౌటర్, ఆప్టికల్ ఫైబర్‌కి కూడా డిమాండ్ పెరిగింది.
దేశవ్యాప్తంగా బిజినెస్ జోరుగా సాగడం, అదే సమయంలో పండుగ సీజన్ కూడా రావడంతో.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా తయారైందని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత కథనం