India GDP growth halves: సగానికి పైగా తగ్గిన జీడీపీ వృద్ధి రేటు-india gdp growth halves in september quarter as covid distortions pass ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  India Gdp Growth Halves In September Quarter As Covid Distortions Pass

India GDP growth halves: సగానికి పైగా తగ్గిన జీడీపీ వృద్ధి రేటు

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 10:07 PM IST

India GDP growth rate: ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలతో ముగిసే రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు మొదటి త్రైమాసికంతో పోలిస్తే, సగానికి పైగా తగ్గింది.

 ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

India GDP growth rate: ఈ ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్(Q2) వరకు ఉన్న త్రైమాసిక ఆర్థిక వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. ఇది జూన్ నెలతో ముగిసే మొదటి త్రైమాసికంతో పోలిస్తే సగానికన్నా తక్కువ. ఏప్రిల్ - జూన్ త్రైమాసికం(Q1)లో భారత వృద్ధి రేటు 13.5% గా నమోదైన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

India GDP growth rate: మొత్తంగా 6.8% నుంచి 7% వరకు

ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6.8% నుంచి 7% వరకు ఉండొచ్చని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(chief economic advisor) వీ అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. ఇది దాదాపు కోవిడ్ ముందునాటి గణాంకాలతో సమానం. ఈ ఆర్థిక సంవత్సరం Q2లో ఆర్థిక వృద్ధి 6.2% ఉండవచ్చని రాయిటర్స్ పోల్ లో ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాను నిజం చేస్తూ ఈ Q2లో వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. కాగా, దేశీయంగా మెరుగైన వృద్ధిని కనబర్చినప్పటికీ.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(Q3)లో వృద్ధి రేటు మరింత తగ్గే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

India GDP growth rate: ఆర్బీఐ చర్యలు

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, వృద్ధి రేటును పెంచడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం మే నెల నుంచి 190 బేసిస్ పాయింట్లను పెంచింది. డిసెంబర్ లో మరో సారి పెంచే అవకాశముంది. అలాగే, సెప్టెంబర్ తో ముగిసే త్రైమాసికంలో ప్రభుత్వం మౌలిక వసతులపై చేసే ఖర్చు కూడా సుమారు 40% పెరిగింది.

India GDP growth rate: ముందుంది మంచి కాలం..

అంతర్జాతీయంగా చోటుచేసుుకుంటున్న ఆర్థిక మందగమనం కారణంగా భారత్ నుంచి చేసే ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పనితీరు చూపనుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. సప్లై సైడ్ లో సర్వీసెస్, డిమాండ్ సైడ్ లో పెట్టుబడులు దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉంటాయని ఆనంద్ రథిలో చీఫ్ ఎకనమిస్ట్ గా చేస్తున్న సుజన్ హజ్రా అంచనా వేశారు.

WhatsApp channel