Renault Duster 2025 : బడ్జెట్ రెడీ చేసుకోండి.. రెనాల్ట్ డస్టర్ 2025 వచ్చేస్తుంది.. 24.5 కి.మీ మైలేజీ
Renault Duster 2025 : రెనాల్ట్ డస్టర్ 2025 భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మంచి మైలేజీతోపాటుగా ఇతర ఫీచర్లు కూడా ఉండనున్నాయి. దీని గురించి సమాచారం తెలుసుకుందాం..
2025 రెనాల్ట్ డస్టర్‌ను 2025 మార్చిలో దక్షిణాఫ్రికాలో లాంచ్ చేయనున్నారు. అదే సమయంలో ఈ ఎస్‌యూవీని భారత్‌లో కూడా విడుదల చేయనున్నారు. 2025 రెనాల్ట్ డస్టర్ ఆర్‌హెచ్‌డీ మోడల్.. ఎల్‌హెచ్‌డీ వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఇది లీటరుకు 24.5 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. దీని స్పెషాలిటీ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
2025 డస్టర్ కంపెనీ సిఎంఎఫ్-బి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని గ్లోబల్ మోడళ్లకు కూడా మద్దతు ఇస్తుంది. ప్యాసింజర్, బూట్ స్పేస్ కోసం స్థలాన్ని పెంచడానికి కొత్త ప్లాట్‌ఫామ్ సహాయపడిందని కంపెనీ పేర్కొంది. భారతీయ మోడల్‌కు పోటీగా ధరలను ఉంచడానికి సీఎంఎఫ్-బి ప్లాన్ చేస్తోంది.
2025 రెనాల్ట్ డస్టర్ పొడవు 4,340 మి.మీ, వీల్ బేస్ 2,657 మి.మీ. అంటే ఈ మోడల్ పాత మోడల్ కంటే పొడవుగా ఉంటుంది. వీల్ బేస్ పాత మోడల్ కంటే కొంచెం చిన్నది. డిజైన్ విషయానికి వస్తే 2025 రెనాల్ట్ డస్టర్ వై-ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, వర్టికల్ ఎయిర్ వెంట్స్, ఇంటిగ్రేటెడ్ రౌండ్ ఫాగ్ ల్యాంప్స్‌తో రీడిజైన్ చేసిన బంపర్‌ను పొందుతుంది. వెనక భాగంలో వై-సైజ్ టెయిల్ లైట్లు, అప్‌డేటెడ్ బంపర్ లభిస్తాయి.
ఫీచర్ల విషయానికొస్తే.. 2025 రెనాల్ట్ డస్టర్ 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్, కొత్త 10.1-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆర్కామిస్ 3డి సౌండ్ సిస్టమ్, రియల్ టైమ్ ట్రాఫిక్ డేటాతో నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి. దీంతోపాటు క్రూయిజ్ కంట్రోల్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆల్-4 డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 6 స్పీకర్ ఆర్కామిస్ 3డీ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా డస్టర్‌లో ఉండనున్నాయి.
గ్లోబల్ మార్కెట్లో 3 ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఒక ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుంది. 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మొత్తం 140బీహెచ్‌పీ పవర్, 148ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 24.5 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఇది కాకుండా ఇంజిన్ ఎల్లప్పుడూ ఎలక్ట్రిక్ శక్తితో ప్రారంభమవుతుంది.
ఈ కొత్త డస్టర్.. హ్యుందాయ్ క్రెటా , కియా సెల్టోస్ , హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైర్డర్, ఎమ్‌జి ఆస్టర్, టాటా కర్వ్‌లకు పోటీగా ఉండే అవకాశం ఉంది. డస్టర్ లాంచ్ అయిన కొన్ని రోజులకు దీనికి సమానమైన నిస్సాన్ మోడల్ కూడా విడుదల కానుంది.