ITR filing: పాన్ కార్డు పనిచేయకపోయినా ఐటిఆర్ దాఖలు చేయవచ్చు; ఇదిగో ఇలా చేయండి; కానీ రీఫండ్ రాదు మరి..
ITR filing: సాధారణంగా, ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడానికి యాక్టివ్ గా ఉన్న పాన్ కార్డు అవసరం ఉంటుంది. అయితే, ఆధార్ కార్డు తో అనుసంధానం చేయని పాన్ కార్డులు ఇకపై పని చేయవని ఆదాయ పన్ను శాఖ గతంలోనే స్పష్టం చేసింది. కానీ, ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ లేకుండానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఉంది.
Income tax e-filing: జూన్ 2023 గడువులోగా మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ (PAN - Aadhaar Link) చేయనట్లైతే, పాన్ ను ఇనాక్టివ్ చేస్తామని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. అయితే, పాన్ క్రియారహితంగా ఉన్నప్పటికీ ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయవచ్చు. పనిచేయని పాన్ కూడా యాక్టివ్ గా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ గతంలో స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆడిట్ అవసరం లేని వ్యక్తులు తమ ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) ను దాఖలు చేయడానికి చివరి తేదీ 2024 జూలై 31.
వెరిఫికేషన్ కు వేరే మార్గాలు ఉన్నాయి..
గడువులోగా మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోయినా, మీ పాన్ పనిచేయకుండా (inoperative PAN) ఉన్నా.. ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయవచ్చని టాక్స్ 2విన్ సీఈఓ అభిషేక్ సోనీ వివరించారు. వెరిఫికేషన్ ప్రక్రియలో ఆధార్ ఓటీపీ మాత్రమే ఉండదని, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఉంటాయని తెలిపారు. ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ కు బదులుగా, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లేదా ఇతర ఆమోదించిన మార్గాల ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC) ను జనరేట్ చేసుకోవచ్చని సూచించారు.
పాన్ పనిచేయకపోతే ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి?
జూన్ 2023 గడువు లోగా ఆధార్ నంబర్ తో పాన్ (PAN Card) ను లింక్ చేయనప్పుడు ఆ పాన్ పనిచేయదు. అయితే, ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ కాకుండా, ఇతర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసి, ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయవచ్చు. పాన్ పనిచేయకపోయినా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియ అలాగే ఉంటుందని గమనించాలి.
ఆన్ లైన్ ఐటీఆర్ దాఖలు ప్రక్రియ సేమ్
ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ లో మీ ఖాతాలోకి లాగిన్ అయి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి, అక్కడ సూచించిన దశలను అనుసరించవచ్చు. ‘‘ఇందులో సాధారణంగా ఈ-ఫైల్ విభాగానికి నావిగేట్ చేయడం, ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ కోసం ఎంపికను ఎంచుకోవడం, అవసరమైన వివరాలు, డాక్యుమెంటేషన్ తో ముందుకు సాగడం వంటివి ఉంటాయి’’ అని అభిషేక్ సోని వివరించారు.
ఆధార్ తో లింక్ చేసుకోవడం మంచిది
ఇనాపరేటివ్ పాన్ తో ఐటీఆర్ లను దాఖలు చేసే వీలు ఉన్నప్పటికీ, పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకుని ఉంటే మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. నిష్క్రియాత్మక పాన్ వివిధ విపరిణామాలకు దారితీస్తుంది. ఇన్ యాక్టివ్ పాన్ తో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తే, ఎటువంటి రిఫండ్ (Refund) ను కానీ, రిఫండ్ పై వడ్డీని కానీ క్లెయిమ్ చేయలేరు. రీఫండ్ క్లెయిమ్స్ కోసం ఆధార్, పాన్ లను లింక్ చేయడం తప్పనిసరి.
అప్డేటెడ్ ఆదాయ పన్ను రిటర్న్స్ కోసం మార్చి 31 గడువు
ఒరిజినల్ ఆదాయ పన్ను రిటర్న్ (ITR) సమర్పించడంలో విఫలమైతే, మార్చి 31, 2024 లోపు అప్డేట్ చేసిన రిటర్న్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులు 2021-22, 2022-23, 2023-24 మదింపు సంవత్సరాల్లో దేనికైనా అప్ డేట్ చేసిన రిటర్నులను దాఖలు చేసే అవకాశం ఉంది.
టాపిక్