Liquid nano DAP: వ్యవసాయంలో విప్లవం: 50 కేజీల డీఏపీ బస్తా బదులుగా లీటర్ లిక్విడ్ నానో డీఏపీ
Liquid nano DAP: ఇఫ్కోరూపొందించిన ద్రవ రూప నానో డీఏపీ ఎరువుల రంగంలో విప్లవాత్మకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసించారు. 50 కేజీల డీఏపీ బస్తా బదులుగా ఒక లీటర్ లిక్విడ్ నానో డీఏపీని వాడొచ్చని తెలిపారు. 50 కేజీల డీఏపీ బ్యాగ్ ధరలో సగం ధరకే ఈ ద్రవ రూప లిక్విడ్ డీఏపీ లభిస్తుందన్నారు.
Liquid nano DAP: దేశవ్యాప్తంగా రైతులు సంప్రదాయ డీఏపీ (traditional DAP) ని ఎరువుగా ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల డీఏపీని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఒకవైపు ఎరువులపై సబ్సీడీ ఇస్తూ, మరోవైపు అధిక ధరకు దిగుమతి చేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి భారంగా మారింది.

Liquid nano DAP: లిక్విడ్ నానో డీఏపీ
ఈ పరిస్థితుల్లో ఇఫ్కో (IFFCO) సంస్థ ప్రపంచంలోనే తొలిసారి ద్రవరూపంలో డీఏపీ ని రూపొందించింది. ఈ లిక్విడ్ నానో డీఏపీ (Di-ammonium Phosphate DAP) సంప్రదాయ ఘన డీఏపీకి ప్రత్యామ్నాయంగా మారనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) బుధవారం ఈ ఇఫ్కో (IFFCO) నానో లిక్విడ్ డీఏపీ (nano liquid DAP)ని ఆవిష్కరించారు. ఈ లిక్విడ్ డీఏపీ (Liquid nano DAP) 500 మిలీ బాటిల్ రూ. 600 లకు రైతులకు లభిస్తుంది. ఒక లీటర్ లిక్విడ్ డీఏపీ (Liquid nano DAP) 50 కేజీల సంప్రదాయ డీఏపీ బస్తాకు సమానం. అంటే, దాదాపు సంప్రదాయ డీఏపీ ధరలో సగం ధరకే ఈ లిక్విడ్ డీఏపీ రైతులకు లభిస్తుంది. ఇఫ్కో రూపొందించిన ఈ లిక్విడ్ డీఏపీ తో అటు కేంద్రంపై దిగుమతి భారం తగ్గడంతో పాటు, రైతులకు తక్కువ ధరకే డీఏపీ లభిస్తుంది. ఈ డీఏపీ (Liquid nano DAP) ని పంట పొలాలపై స్ప్రే చేయడం కూడా సంప్రదాయ డీఏపీతో పోలిస్తే చాలా సులువు. నానా యూరియా, నానో డీఏపీ వంటివి భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయని ఈ సందర్భంగా అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు.
Liquid nano DAP: గుజరాత్ లోనే తొలి ప్లాంట్
ఈ లిక్విడ్ డీఏపీ (Liquid nano DAP) ఉత్పత్తికి సంబంధించిన తొలి ప్లాంట్ ను గుజరాత్ లోని కలోల్ లో ఇఫ్కో (IFFCO) ఏర్పాటు చేయనుంది. బంగాళాదుంప పంటలకు ఎకరానికి సుమారు 6 నుంచి 8 బస్తాల సంప్రదాయ డీఏపీని హరియాణా, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్ రైతులు వాడుతారు. అలాగే, కర్నాటక, బిహార్ రైతులు జొన్న, చెరకు, ఇతర కూరగాయాల పంటలకు ఎక్కువగా డీఏపీని వాడుతారు. 2025-26 నాటికి 18 కోట్ల బాటిల్స్ నానో లిక్విడ్ డీఏపీ ని ఉత్పత్తి చేయాలని ఇఫ్కో (IFFCO) లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ లో ప్రస్తుతం సుమారు 1 కోటి నుంచి 1.25 కోట్ల టన్నుల డీఏపీ (traditional DAP) అవసరం ఉంటుంది. ఇందులో 40 లక్షల నుంచి 50 లక్షల టన్నుల డీఏపీ (traditional DAP) మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతోంది.
టాపిక్