ంట్లో సొంత కారు ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా పెద్ద విషయం ఎందుకంటే చిన్న కారు కొనడానికి కూడా లక్షల రూపాయలు కావాలి. ఉద్యోగస్తులకు కారు కొనడం మరింత కష్టం. ఎందుకంటే జీతం నుండి చాలా తక్కువ డబ్బు ఆదా చేసుకుంటారు. ఇంటి ఖర్చులకే చాలా డబ్బు పోతుంది. తర్వాత ఈఎంఐలు. అయితే చాలా మంది లోన్ మీద కారు కొనాలని చూస్తుంటారు. ఈ సమయంలో కూడా మీ బడ్జెట్‌ను మరచిపోకూడదు. మీ బడ్జెట్ ప్రకారం కారును రుణం మీద తీసుకోవాలి.
ఉద్యోగం ఉన్నవారు ఈఎంఐపై సులభంగా కారు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా రూ.50,000 రూపాయల వరకు జీతం ఉన్నవారు ఈ కార్లను ఈఎంఐపై కొంటే సమస్యలు ఎక్కువగా ఉండవు.
రూ.50,000 వరకు జీతం ఉన్న వ్యక్తి మారుతి సుజుకి సెలెరియో కారును ఈఎంఐ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.64 లక్షలు. ఇతర ఖర్చులతో కలిపి కారు ధర దాదాపు రూ.6.20 లక్షలు అవుతుంది. అటువంటి పరిస్థితిలో రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి కారు కొనవచ్చు.
రూ.50,000 వరకు జీతం ఉన్న వ్యక్తి టాటా మోటార్స్‌కు చెందిన టాటా టియాగో కారును ఈఎంఐపై సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5 లక్షలు. ఇతర ఖర్చులతో కలిపి కారు ధర దాదాపు రూ.6.50 లక్షలు అవుతుంది. రూ.1 లక్ష డౌన్ పేమెంట్ తర్వాత మీరు ఈ కారును సులభంగా కొనుగోలు చేయవచ్చు.
టాటా పంచ్ కొనడం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఈ కారు ఆన్ రోడ్ ధర రూ. 10.56 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే దీని కోసం మీరు ప్రతి నెలా ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి రావచ్చు. మీ నెలవారీ ఖర్చుల ప్రకారం మీరు ఈఎంఐని చెక్ చేయవచ్చు.