Best Family Cars : కొత్త ఏడాదిలో కారు కొనాలని చూస్తే.. చిన్న ఫ్యామిలీకి సూట్ అయ్యే ఈ కార్లు చూడండి!-if you want to buy new car in new year 2025 heres best small family cars for you maruti suzuki dzire to tata tiago ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Family Cars : కొత్త ఏడాదిలో కారు కొనాలని చూస్తే.. చిన్న ఫ్యామిలీకి సూట్ అయ్యే ఈ కార్లు చూడండి!

Best Family Cars : కొత్త ఏడాదిలో కారు కొనాలని చూస్తే.. చిన్న ఫ్యామిలీకి సూట్ అయ్యే ఈ కార్లు చూడండి!

Anand Sai HT Telugu
Dec 29, 2024 08:30 PM IST

Best Family Cars : కొత్త ఏడాదిలో కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం చాలా కార్లు మార్కెట్‌లో వెయిట్ చేస్తున్నాయి. 2025లో కారు కొనాలని చూస్తున్నవారి కోసం లిస్టు ఉంది.. ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లాంటి సిటీల్లో ఉంటున్న చిన్న ఫ్యామిలీలకు ఉపయోగపడే కొన్ని కార్లు మార్కెట్‌లో ఉన్నాయి. వీటి బడ్జెట్ కూడా తక్కువలోనే ఉంటుంది. సిటీలోనే ఏ ప్రదేశానికైనా వెళ్లాలి అంటే ప్రతీసారి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారు కారు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మంచి మైలేజీతోపాటు ఫీచర్లతో వచ్చే వాటి కోసం చూస్తున్నవారికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్‌లో కార్లు మీ కోసం చూస్తున్నాయి. ఒకవేళ మీరు 2025లో కారు కొనుక్కోవాలని అనుకుంటే మీ కోసం లిస్టు ఉంది.. చూసేయండి..

yearly horoscope entry point

మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి డిజైర్ గురించి చూస్తే.. ఈ కారు ధర రూ.6.79 లక్షల నుండి రూ.10.14 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 24.79 నుండి 33.73 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తుంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, ఆటో ఏసీ వంటి అనేక ఫీచర్లను పొందుతుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ రూ.5.54 లక్షల నుండి రూ.7.33 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్ అండ్ సీఎన్జీ ఇంజన్‌తో 23.56 నుండి 34.05 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.04 లక్షల నుండి రూ. 11.21 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 16 నుండి 20 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా అనేక ఫీచర్లను ఇస్తుంది.

రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుండి రూ.6.45 లక్షల మధ్య ఉంటుంది. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఆధారితం. ఇది 21.46 నుండి 22.3 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఇది 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీతో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది.

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ.6.50 లక్షల నుండి రూ.11.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇంజిన్ 1.2-లీటర్ పెట్రోల్ అండ్ సీఎన్జీ, 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-డీజిల్ ఉన్నాయి. ఇది 19.33 నుండి 26.20 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తుంది.

టాటా టియాగో

టాటా టియాగో ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. ఇది చిన్న ఫ్యామిలీకి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇది రూ. 5 లక్షల నుండి రూ.8.75 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వస్తుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్లు ఉన్నాయి. ఇది 19.43 నుండి 28.06 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఇందులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Whats_app_banner