ఎమర్జెన్సీ సమయంలో పీఎఫ్ ఖాతా నుంచి వెంటనే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఈపీఎఫ్ఓ ప్లానింగ్!-if you have emergency you may withdraw money directly from your pf account without paperwork required in future ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎమర్జెన్సీ సమయంలో పీఎఫ్ ఖాతా నుంచి వెంటనే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఈపీఎఫ్ఓ ప్లానింగ్!

ఎమర్జెన్సీ సమయంలో పీఎఫ్ ఖాతా నుంచి వెంటనే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఈపీఎఫ్ఓ ప్లానింగ్!

Anand Sai HT Telugu
Jan 09, 2025 08:25 AM IST

EPFO Update : జనవరి లేదా ఫిబ్రవరి చివరి వారంలో ఈపీఎఫ్ఓ తన ఐటీ సిస్టమ్ 3.0పై పనిని ప్రారంభిస్తోందని తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ఖాతా నుండి నిర్దిష్ట మొత్తంలో డబ్బును తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు.

పీఎఫ్ విత్ డ్రా
పీఎఫ్ విత్ డ్రా

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు సమగ్ర బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తోంది. దీని కింద ఈపీఎఫ్ఓ సభ్యులు అత్యవసర పరిస్థితుల్లో నేరుగా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం వారు ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉపసంహరణ పరిమితి నిర్ణయిస్తారు.

yearly horoscope entry point

దీనిపై ఈపీఎఫ్ఓ అధికారులు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్, ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నట్లు సమాచారం. జనవరి లేదా ఫిబ్రవరి చివరి వారంలో ఈపీఎఫ్ఓ తన ఐటీ సిస్టమ్ 3.0 పై పనిని ప్రారంభిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్, ఇతర బ్యాంకుల సిఫారసులకు అనుగుణంగా ఐటీ వ్యవస్థలో మార్పులు చేయనున్నారు. ఇప్పటివరకు ఈపీఎఫ్ఓకు పలు నిబంధనలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో సభ్యులు తమ ఖాతా నుంచి నిర్దిష్ట మొత్తాన్ని వెంటనే విత్ డ్రా చేసుకోవచ్చని, ఇందుకోసం వారు ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

ఈపీఎఫ్ఓకు ఈ మేరకు పలు సూచనలు కూడా వెళ్లాయి. కొత్త కార్డులను జారీ చేయరాదని, అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని నేరుగా ఉపసంహరించుకునేలా అనుమతించాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్), పోర్టల్, యాప్ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా సభ్యులు వెంటనే తమ బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేసుకోవచ్చు. దీని తరువాత బ్యాంకులు డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా నిధులను ఉపయోగించగలరు. దీంతో ఈపీఎఫ్ఓ వ్యవస్థ మొత్తం బ్యాంకింగ్ తరహాలో పనిచేయగలుగుతుంది.

దీని కోసం ఈపీఎఫ్ఓ అన్ని ప్రధాన బ్యాంకులను యుఏఎన్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. ఇది ఖాతాకు నిధులను బదిలీ చేయడం సులభం చేస్తుంది. జూన్ నాటికి ఐటీ సిస్టమ్ 3.0 పనులు పూర్తవుతాయని, దీని కింద అన్ని ప్రధాన ఆర్థిక సంస్థల నుంచి సలహాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈపీఎఫ్ఓ విడిగా ఏటీఎం కార్డు జారీ చేస్తే దాని కోసం చాలా మార్పులు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బ్యాంకింగ్ లైసెన్సులతో సహా ఇతర అనుమతులు కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి పొందాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఎక్కువ సిబ్బంది అవసరం. దీంతో ఆ వైపుగా సీరియస్‌గా కసరత్తు జరుగుతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అత్యవసరం, ఇతర పరిస్థితుల్లో ప్రజల పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించడమే ఈపీఎఫ్ఓ ఉద్దేశం.

ఐటీ 3.0 కింద పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించిన వ్యవస్థను సరళతరం చేస్తామని ఈపీఎఫ్ఓ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. కొత్త పద్ధతి అమల్లోకి వస్తే అత్యవసర పరిస్థితుల్లో సభ్యులు సులభంగా ఉపసంహరణలు చేసుకోగలుగుతారు. దీని కోసం ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Whats_app_banner