Bank service charges: మే 1 నుంచి ఈ బ్యాంక్ సర్వీస్ చార్జీల పెంపు; నగదు లావాదేవీలపై భారీ వడ్డన
మే 1వ తేదీ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల సర్వీస్ చార్జీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో చెక్ బుక్ చార్జెస్, ఐఎంపీఎస్ లావాదేవీలు, డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ చార్జీలు.. మొదలైనవి ఉన్నాయి. హోం బ్రాంచ్ లో కూడా నగదు లావాదేవీలపై భారీగా చార్జీలను వసూలు చేయనున్నారు. పూర్తి వివరాలు..
ఐసీఐసీఐ బ్యాంక్ నగదు లావాదేవీలపై భారీగా చార్జీల వడ్డన
ICICI Bank service charges hike: ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలను వచ్చే నెల నుంచి మారుస్తున్నట్లు ప్రకటించింది. చెక్ బుక్ జారీ, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డ్ చార్జీలు.. సహా పలు సేవలపై రుసుములను సవరించింది. డెబిట్ కార్డులకు రెగ్యులర్ లొకేషన్లలో రూ.200, గ్రామీణ ప్రాంతాల్లో రూ.99 వార్షిక ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం, ఈ మార్పులు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.
ఐసిఐసిఐ బ్యాంక్ సర్వీస్ చార్జీల్లో మార్పులు
- డెబిట్ కార్డ్ వార్షిక రుసుమును రెగ్యులర్ లొకేషన్స్ కు రూ. 200గా, గ్రామీణ ప్రాంతాలకు రూ.99 గా నిర్ణయించారు.
- చెక్ బుక్స్ లో వార్షికంగా మొదటి 25 చెక్ లీవ్ లకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత, రూ. 25 వేల లావాదేవీ పరిమితితో ఒక్కో లీఫ్ కు రూ.4 సర్వీస్ చార్జిగా వసూలు చేస్తారు.
- హోమ్ బ్రాంచ్ లో నెలకు మొదటి 3 నగదు లావాదేవీలు ఉచితం. ఆ తరువాత ప్రతి లావాదేవీకి రూ.150.
- నెలకు ఫ్రీ లిమిట్ అయిన రూ. 1 లక్ష తరువాత, ప్రతీ 1000 రూపాయలకు రూ. 5 రుసుమును వసూలు చేస్తారు. లేదా రూ. 150 (ఏది ఎక్కువైతే అది)
- నాన్ హోమ్ బ్రాంచ్ లో రోజుకు రూ. 25 వేల ట్రాన్సాక్షన్ దాటిన తరువాత ప్రతీ రూ. 1000 కి రూ. 5 లేదా మొత్తంగా రూ.150 ( ఏది ఎక్కువైతే అది)
- థర్డ్ పార్టీ నగదు లావాదేవీల్లో ఒక్కో లావాదేవీకి రూ.150, లావాదేవీ పరిమితి రూ.25,000.
- డీడీ/ పీవో క్యాన్సిలేషన్/ డూప్లికేట్/ రీవాలిడేషన్ కింద రూ.100 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి.
- ఐఎంపీఎస్ ఔట్ వర్డ్ లావాదేవీల్లో రూ. 1000 లోపు లావాదేవీకి రూ. 2.50.
- రూ.1,001 నుంచి రూ.25,000 వరకు: ఒక్కో లావాదేవీకి రూ.5.
- రూ.25,000 నుంచి రూ.5 లక్షలకు మించి: ఒక్కో లావాదేవీకి రూ.15.
- ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాను మూసివేతకు ఎలాంటి చార్జీలు లేవు.
- డెబిట్ కార్డ్ పిన్ ను రీ జనరేట్ చేయడానికి ఎలాంటి చార్జీలు లేవు.
- డెబిట్ కార్డు డీ-హాట్ లిస్టింగ్ కు ఎలాంటి చార్జీలు లేవు.
- బ్యాలెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎలాంటి చార్జీలు లేవు.
- ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఎలాంటి చార్జీలు లేవు.
- పాత లావాదేవీ డాక్యుమెంట్లు/ పాత రికార్డులకు సంబంధించిన ఎంక్వైరీల పునరుద్ధరణకు ఎలాంటి చార్జీలు లేవు.
- ఫోటో అటెస్టేషన్ కు ప్రతి అప్లికేషన్ కు రూ.100.
- సంతకం ధృవీకరణకు ప్రతి దరఖాస్తుకు రూ.100.
- చిరునామా నిర్ధారణకు ఎలాంటి చార్జీలు లేవు.
- ఇన్ ఆపరేటివ్ అకౌంట్ కు ఎలాంటి చార్జీలు లేవు.
- స్టాప్ పేమెంట్ ఛార్జీలు ప్రతీ చెక్ కు రూ. 100.
- స్టాప్ పేమెంట్ ఈసీఎస్ కు ఎలాంటి చార్జీలు లేవు.
- లాకర్ పరిమాణం మరియు బ్రాంచ్ లొకేషన్ ఆధారంగా వార్షిక లాకర్ అద్దెలు మారుతూ ఉంటాయి.
- ఇంటర్నెట్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను మళ్లీ జారీ చేయడానికి ఎలాంటి చార్జీలు లేవు.
- చిరునామా మార్పు అభ్యర్థనకు ఎలాంటి చార్జీలు లేవు.
- నాచ్ (NACH) చెల్లింపులకు ఒకేసారి ఆథరైజేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.