Hyundai Verna 2023: హ్యుండాయ్ వెర్నా 2023 మరో టీజర్: మరిన్ని వివరాలు వెల్లడి-hyundai verna 2023 teased again more details out check updates and expected price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hyundai Verna 2023 Teased Again More Details Out Check Updates And Expected Price

Hyundai Verna 2023: హ్యుండాయ్ వెర్నా 2023 మరో టీజర్: మరిన్ని వివరాలు వెల్లడి

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 04, 2023 11:31 AM IST

Hyundai Verna 2023: హ్యుండాయ్ వెర్నా 2023 కారుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటికి వచ్చాయి. మరో టీజర్‌ను హ్యుండాయ్ విడుదల చేసింది.

Hyundai Verna 2023: హ్యుండాయ్ వెర్నా 2023 మరో టీజర్: మరిన్ని వివరాలు వెల్లడి
Hyundai Verna 2023: హ్యుండాయ్ వెర్నా 2023 మరో టీజర్: మరిన్ని వివరాలు వెల్లడి (HT Auto)

Hyundai Verna 2023: పాపులర్ కంపాక్ట్ సెడాన్ కారు “హ్యుండాయ్ వెర్నా” (Hyundai Verna)కు నయా జనరేషన్ రానుంది. హ్యుండాయ్ వెర్నా 2023 ఈనెలలోనే విడుదల కానుంది. ఈ నెల 21వ తేదీన ఈ ఆరో జనరేషన్ వెర్నా కారు అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ కారు గురించి కొంత సమాచారం బయటికి వచ్చింది. తాజా హ్యుండాయ్ మోటార్స్.. ఈ కొత్త వెర్నా(New Hyundai Verna)కు సంబంధించి మరో టీజర్‌ను విడుదల చేసింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీని ద్వారా మరికొంత సమాచారం తెలిసిపోయింది. ఫీచర్లు, డిజైన్‍కు సంబంధించిన కొన్ని వివరాలు ఈ వీడియోలో హ్యుండాయ్ టీజ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

షార్ప్ డిజైన్‍తో..

Hyundai Verna 2023: కొత్త హ్యుండాయ్ వెర్నా ఫ్రంట్ డిజైన్‍ను ఈ టీజర్‌లో కాస్త చూపించింది హ్యుండాయ్. స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే ఈ నయా మోడల్ ఫ్రంట్ డిజైన్‍లో మార్పులు ఉన్నట్టు స్పష్టమైంది. కొత్త వెర్నా మోడల్ ఫ్రంట్‍ డిజైన్ మరింత షార్ప్‌గా ఉంది. దీంతో ఫ్రంట్ లుక్ మరింత స్పోర్టీగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రిల్ డిజైన్ చాలా మారింది. ఎల్ఈడీ లైట్ బార్‌తో ఈ గ్రిల్ హైలైట్ అవుతోంది. బొనెట్ విడ్త్ మొత్తం ఈ లైట్ బార్ ఉంటుంది. ఇక ప్రస్తుత వెర్షన్‍తో పోలిస్తే ఈ నయా వెర్నా బంపర్ కూడా రీడిజైన్ అయింది. ఎల్ఈడీ హైడ్‍లైట్స్ యూనిట్లకు పక్కన కొత్త డిజైన్ ఫాగ్‍ల్యాంప్ కేసెస్ ఉన్నాయి.

Hyundai Verna 2023: ఈ కొత్త హ్యుండాయ్ వెర్నా మోడల్ సరికొత్త డిజైన్ అలాయ్ వీల్‍లో రానుంది. ఇక డ్రైవర్ డిస్‍ప్లే ఉండనుంది. అలాగే ఏడీఏఎస్ ఫంక్షనాలిటీ ఉంటుందని సమాచారం. ఇప్పటికే టక్సన్ ఎస్‍యూవీలో ఈ ఫీచర్ ఉండగా.. ఈ కొత్త వెర్నా మోడల్‍కు కూడా ఉంటుందని తెలుస్తోంది.

అధిక బూట్ స్పేస్

Hyundai Verna 2023: హ్యుండాయ్ వెర్నా 2023లో 528 లీటర్స్ లగేజ్ కెపాసిటీతో కూడిన బూట్ స్పేస్ ఉండనుంది. ఈ సెగ్మెంట్‍లో ఇదే అత్యధికం. ప్రస్తుత మోడల్ కన్నా ఇది 50 లీటర్స్ అధికం. అలాగే కొత్త వెర్నా 2,670mm వీల్ బేస్‍ను కలిగి ఉంటుంది. ఇక క్యాబిన్‍లో ఫోన్ హోల్డర్, మల్టిపుల్ బాలిల్ హోల్డర్లు, మల్టీపర్పస్ కన్సోల్, కూల్డ్ గ్లవ్ బాక్స్ ఉంటాయి.

Hyundai Verna 2023: పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‍లలోనే హ్యుండాయ్ వెర్నా 2023 రానుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1.2 లీటర్ టర్బో చార్జ్‌డ్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. నాలుగు వేరియంట్లలో నయా వెర్నా లభిస్తుందని సమాచారం. ఇప్పటికే హ్యుండాయ్ వెర్నా 2023 బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ నయా వెర్నా ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.17లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం