Hyundai Verna 2023: కొత్త హ్యుండాయ్ వెర్నా కారు లాంచ్ రేపే: నయా ఫీచర్లతో: ధర ఎంత ఉండొచ్చంటే!-hyundai verna 2023 set to launch tomorrow in india check features price details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hyundai Verna 2023 Set To Launch Tomorrow In India Check Features Price Details

Hyundai Verna 2023: కొత్త హ్యుండాయ్ వెర్నా కారు లాంచ్ రేపే: నయా ఫీచర్లతో: ధర ఎంత ఉండొచ్చంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 20, 2023 04:13 PM IST

Hyundai Verna 2023 launch: హ్యుండాయ్ వెర్నా 2023 కారు రేపు (మార్చి 21) ఇండియాలో లాంచ్ కానుంది. ఈ సెడాన్ నయా ఫీచర్లు, అంచనా ధర ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Hyundai Verna 2023: కొత్త హ్యుండాయ్ వెర్నా కారు లాంచ్ రేపే: వివరాలివే
Hyundai Verna 2023: కొత్త హ్యుండాయ్ వెర్నా కారు లాంచ్ రేపే: వివరాలివే (HT Auto)

Hyundai Verna 2023 launch: కొత్త జనరేషన్ వెర్నా (New Generation Hyundai Verna) కారును లాంచ్ చేసేందుకు హ్యుండాయ్ మోటార్స్ సిద్ధమైంది. రేపు (మార్చి 21) హ్యుందాయ్ వెర్నా 2023 సెడాన్ కారు భారత మార్కెట్‍లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ నడుస్తుండగా.. రేపు లాంచ్ కానుంది. ప్రస్తుతం ఉన్న వెర్నా మోడల్ కంటే ఈ నయా హ్యుండాయ్ వెర్నా 2023.. మరింత పెద్దగా, పవర్‌ఫుల్‍గా, సరికొత్త ఫీచర్లను కలిగి ఉంది. ఏడీఏఎస్ టెక్నాలజీతో ఈ నయా సెడాన్ కారు వస్తోంది. హ్యుండాయ్ వెర్నా 2023 గురించి ఇప్పటి వరకు వెల్లడైన విషయాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Hyundai Verna 2023 launch: ఈ సెగ్మెంట్‍లో అత్యంత వెడల్పైన సెడాన్ కారుగా హ్యుండాయ్ వెర్నా 2023 ఉండనుంది. ఈ కారు 1,765 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని వీల్‍బేస్ 2,670 మిల్లీమీటర్లు. 15 ఇంచుల అలాయ్ వీల్‍లతో ఈ నయా వెర్నా కారు రానుందని తెలుస్తోంది.

Hyundai Verna 2023: ఇంజిన్ ఇలా..

1.5 లీటర్ నేచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్‍ ఇంజిన్‍తో హ్యుండాయ్ వెర్నా 2023 రానుంది. అలాగే టర్బో‍చార్జ్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ రెండు ఇంజిన్ వేరియంట్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్ బాక్సెస్‍ను కలిగి ఉంటాయి. టర్బో చార్జ్డ్ వేరియంట్‍కు సెవెన్-స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉండనుంది. స్టాండర్డ్ 1.5 లీటర్ ఇంజిన్ 115 పీఎస్ పవర్‌ను, 144 Nm టార్క్యూను జనరేట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇక టార్బోచార్జ్డ్ ఇంజిన్ మరింత శక్తివంతంగా ఉండనుండగా.. 163 పీఎస్ పవర్ ఔట్‍పుట్, 253 Nm పీక్ టార్క్యూను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది.

Hyundai Verna 2023: కొత్త ఫీచర్లతో..

ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌తో ఈ సరికొత్త హ్యుండాయ్ వెర్నా 2023 రానుంది. 17 ఫీచర్లతో కూడిన హ్యుండాయ్ స్మార్ట్ సెన్స్‌ను ఉపయోగించి లెవెల్ 2 ఏడీఏఎస్‍ను ఈ కారులో ఇస్తున్నట్టు హ్యుండాయ్ చెప్పింది. కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపాచర్ వార్నింగ్ సహా మరికొన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఏడీఏఎస్‍ను కలిగి ఉన్న రెండో సెడాన్ కారుగా వెర్నా 2023 నిలువనుంది. ఈ టెక్నాలజీతో ఈనెలలో హోండా సిటీ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ అయింది.

Hyundai Verna 2023: 10.25 ఇంచుల హెచ్‍డీ ఇన్ఫోటైన్‍మెంట్ స్క్రీన్, ఓ డిజిటల్ క్లస్టర్‌తో హ్యుండాయ్ వెర్నా 2023 రానుంది. 8 స్పీకర్ల బాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది.

Hyundai Verna 2023 Price: అంచనా ధర

హ్యుండాయ్ వెర్నా ప్రస్తుత మోడళ్ల ధర రూ.9.63లక్షల నుంచి రూ.15.71లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ సరికొత్త జనరేషన్ హ్యుండాయ్ వెర్నా 2023 ధర రూ.11లక్షల నుంచి రూ.18లక్షల మధ్య ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel