Hyundai Venue : బెస్ట్​ సెల్లింగ్​ హ్యుందాయ్​ వెన్యూ కొత్త వేరియంట్​ లాంచ్​- తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్​!-hyundai venue gets a more affordable variant with sunroof priced at 10 lakh ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Venue : బెస్ట్​ సెల్లింగ్​ హ్యుందాయ్​ వెన్యూ కొత్త వేరియంట్​ లాంచ్​- తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్​!

Hyundai Venue : బెస్ట్​ సెల్లింగ్​ హ్యుందాయ్​ వెన్యూ కొత్త వేరియంట్​ లాంచ్​- తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్​!

Sharath Chitturi HT Telugu
Aug 03, 2024 05:57 AM IST

Hyundai Venue new variant : సన్​రూఫ్​తో కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ) ప్లస్ లాంచ్​ అయ్యింది. ఈ ఫీచర్​ను అందించే నెక్ట్స్​ వేరియంట్ కంటే ఈ కొత్త వేరియంట్​ ధర రూ .1.05 లక్షలు చౌక! పూర్తి వివరాలు..

హ్యుందాయ్​ వెన్యూ కొత్త వేరియంట్​ లాంచ్​..
హ్యుందాయ్​ వెన్యూ కొత్త వేరియంట్​ లాంచ్​..

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా కొత్త వెన్యూ ఎస్ (ఓ) ప్లస్​ వేరియంట్​ని విడుదల చేసింది. ఇది ఎస్​యూవీకి ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఆప్షన్​ని మరింత సరసమైన ధరలో తీసుకువస్తుంది. సన్​రూఫ్​తో కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ) ప్లస్ ధర రూ .10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఫీచర్​ను అందించే నెక్ట్స్​ వేరియంట్ కంటే దీని ధర రూ .1.05 లక్షలు చౌక! ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ)+..

కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ)+ వేరియంట్ 5-స్పీడ్ మేన్యువల్ గేర్​బాక్స్​తో కనెక్ట్​ చేసిన 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్​తో మాత్రమే లభిస్తుంది. మోడల్ లైనప్​లో ఎస్ (ఓ), ఎస్ఎక్స్ వేరియంట్ల మధ్య ఈ కొత్త వేరియంట్​ను ఉంచింది సంస్థ. కొత్త ఎస్ (ఓ)+ ట్రిమ్ ఎస్ (ఓ) ట్రిమ్ నుంచి అనేక క్వాలిటీస్​ కలిగి ఉంది. అదే సమయంలో ఎస్ఎక్స్ వేరియంట్ నుంచి ఎలక్ట్రిక్ సన్​రూఫ్​ జోడించింది.

హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ)+ ఫీచర్లు..

వెన్యూ ఎస్ (ఓ)+ ఎస్​యూవీ ట్రిమ్​లో వైర్​లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కలర్ టీఎఫ్​టీ ఎంఐడీ యూనిట్​తో డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్స్​తో కూడిన ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, ఆటోమేటిక్ హెడ్​ల్యాంప్స్, టీపీఎంఎస్, రియర్ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భద్రత విషయానికి వస్తే, మిడ్-లెవల్ వేరియంట్ 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్సీ, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ సహా మరెన్నో ఫీచర్స్​ కలిగి ఉంది. వెన్యూ ఎస్ (ఓ)+ లో 15 ఇంచ్​ స్టీల్ వీల్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ)+ పోటీ..

ఎలక్ట్రిక్ సన్​రూఫ్​తో హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ)+ ఖచ్చితంగా ఔత్సాహిక కొనుగోలుదారులకు ఈ ఫీచర్​ను మరింత చౌకగా అందిస్తుంది. అయితే, ఈ సెగ్మెంట్​లో ఇది అత్యంత చౌకైన కలిగిన ఆఫర్ కాదు! మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ఎంఎక్స్ 2 ప్రో వేరియంట్​లో ఈ ఫీచర్​ని రూ .8.99 లక్షలకే సంస్థ అందిస్తోంది.. అదే సమయంలో, కియా సోనెట్ హెచ్​టీఈ (ఓ) ట్రిమ్​లో ఎలక్ట్రిక్ సన్​రూఫ్​ ధర రూ .8.29 లక్షలకే లభిస్తోంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

హ్యుందాయ్ నుంచి మరో హైబ్రిడ్ కార్..

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తన పాపులర్ సీఎన్జీ హ్యాచ్ బ్యాక్ గ్రాండ్ ఐ 10 నియోస్ హై-సీఎన్జీ డుయో లేటెస్ట్ వర్షన్ ను భారతదేశంలో శుక్రవారం లాంచ్ చేసింది. దీనికి రూ .7.75 లక్షల (ఎక్స్-షోరూమ్) బేస్ ధరగా నిర్ణయించింది. ఈ కొత్త సీఎన్జీ వేరియంట్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. హ్యుందాయ్ ఎక్స్ టర్ హై సీఎన్జీ డుయో తరువాత హ్యుందాయ్ లైనప్ లో ఈ సాంకేతికతను కలిగి ఉన్న రెండవ మోడల్ ఇదే అవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం