Hyundai Ioniq 9 Electric SUV : హ్యుందాయ్ ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!
Hyundai Ioniq 9 Electric SUV : హ్యుందాయ్ ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. ఈ కారుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారత్ మొబిలిటీ షోలో క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటు హ్యుందాయ్ ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. భారతదేశంలో ఐయోనిక్ 9ని తీసుకురావడానికి కంపెనీకి ఎటువంటి ప్రణాళిక లేదు. హ్యుందాయ్ బ్రాండ్ ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ కారును దక్షిణ కొరియా, ఉత్తర అమెరికా మార్కెట్లలో మెుదట్లో పరిచయం చేస్తారు. ఆ తర్వాత ఇతర దేశాల మార్కెట్‌లోకి ఎంటర్ అవుతుంది.
మంచి రేంజ్
హ్యుందాయ్ ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 110.3kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది. ఇది WLTP ప్రకారం 620 కి.మీ రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్, పెర్ఫార్మెన్స్ ట్రిమ్‌లలో వస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎఫ్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ సెటప్‌లతో అందుబాటులో ఉంది.
స్పీడ్‌లోనూ తోపు
లాంగ్ రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్ 218 బీహెచ్‌పీ పవర్, 350 ఎన్ఎం టార్క్ కోసం మంచి రియర్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఈ మోడల్ 9.4 సెకన్లలో 0 నుండి 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. ఏడబ్ల్యూడీ వేరియంట్‌లో ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ మోటార్ ఉంది. లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ 95 బీహెచ్‌పీ పవర్, 255 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 6.7 సెకన్లలో 0 నుండి 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. లాటరల్ విండ్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ టార్క్ వెక్టరింగ్, టెర్రైన్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇతర ఫీచర్లు
హ్యుందాయ్ ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 6, 7 సీట్ల ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులో 12 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్, యాంబియంట్ లైటింగ్, బహుళ కెమెరాలు, సెన్సార్‌లతో కూడిన ఏడీఏఎస్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది అన్ని సీట్లలో 10 ఎయిర్‌బ్యాగ్‌లు, డ్యూయల్ యూఎస్‌బీ సీ పోర్ట్‌లను కూడా అందిస్తుంది.
హ్యుందాయ్ ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ జీఎంపీ మాడ్యులర్ జనన్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లలో హ్యుందాయ్ పారామెట్రిక్ పిక్సెల్ ఇన్‌సర్ట్‌లు, 19-అంగుళాల (స్టాండర్డ్) నుండి 21-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది.